ఐదు రూపాయలకే వైద్యం అందించి.. నిరుపేదల గుండెల్లో దేవుడిగా నిలిచిన చెన్నై వ్యాసరపాడికి చెందిన డాక్టర్ తిరివెంగదమ్ వీరరాఘవన్ ఇక లేరు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం రాత్రి తుదిశ్వాస విడిచినట్లు ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు.
1973లో వ్యాసర్పాడి అశోక స్తంభానికి సమీపంలోని ఎరుక్కంచెరి ప్రాంతంలో క్లినిక్ స్థాపించారు వీరరాఘవన్. అప్పటినుంచి నిరుపేదలకు ఎలాంటి లాభాపేక్ష లేకుండా సేవ చేస్తున్నారు. తొలుత కేవలం రూ.2 ఫీజుతో వైద్య సేవలు అందించేవారు. ప్రతిరోజు ఆయన క్లినిక్ రోగులతో కిటకిటలాడేది. ఒక్కోసారి అర్ధరాత్రి వరకు రోగులను పరీక్షించేవారంటే అతిశయోక్తి కాదు. కొద్ది రోజుల తర్వాత తన వద్దకు వచ్చేవారి ఒత్తిడితో ఫీజును రూ.5కు పెంచారు. అదే ఫీజుతో తన చివరి క్షణాల వరకు సేవలందించారు.
వీరరాఘవన్ జీవితగాథ ఆధారంగా తమిళ స్టార్ హీరో విజయ్ 'ఐదు రూపాయల డాక్టర్'గా నటించిన చిత్రం 'మెర్సల్' తో ఆయన సేవలు వెలుగులోకి వచ్చాయి.
2015లో వరదల్లో వీర రాఘవన్ క్లినిక్ పూర్తిగా ధ్వంసమైంది. అక్కడి నుంచి సమీపంలోని మరో ప్రాంతంలో క్లినిక్ ఏర్పాటు చేసినప్పటికీ తన ఫీజును మాత్రం ఐదు రూపాయలుగానే కొనసాగించారు.
సున్నితంగా తిరస్కరించేవారు..