తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'లాక్​డౌన్​ చాలదు- టెస్టులు పెంచితేనే ఫలితం'​ - కరోనా తాజా వార్తలు

కరోనా మహమ్మారిని ఎదుర్కోవాలంటే లాక్‌డౌన్‌ మాత్రమే సరిపోదని.. వైద్య పరీక్షలు గణనీయంగా పెంచాలని కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ అన్నారు. ఆయన ఈ రోజు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మీడియాతో మాట్లాడారు. కరోనా నియంత్రణపై కేంద్రానికి పలు సూచనలు చేశారు.

RAHUL
రాహుల్

By

Published : Apr 16, 2020, 3:30 PM IST

కరోనా వైరస్‌ వ్యాప్తి నివారణకు లాక్‌డౌన్‌ మాత్రమే పరిష్కారం కాదని అభిప్రాయపడ్డారు కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ. లాక్‌డౌన్.. వైరస్​ వ్యాప్తి తాత్కాలికంగా ఆలస్యం చేయగలదే తప్ప పూర్తిగా అరికట్టలేదన్నారు.

కరోనా సంక్షోభంపై వీడియో కాన్ఫరెన్స్​ ద్వారా మీడియాతో మాట్లాడారు రాహుల్.

రాహుల్​ గాంధీ, కాంగ్రెస్​ నేత

"లాక్​డౌన్​ అనేది కేవలం తాత్కాలికం. ఇది ఎంతమాత్రం కరోనా నివారణకు పరిష్కారం కాదు. లాక్​డౌన్​ పూర్తయ్యాక వైరస్​ మళ్లీ వేగంగా తన పనిచేయడం మొదలు పెడుతుంది. వైరస్​పై పోరుకు అతిపెద్ద ఆయుధం టెస్టింగ్​. దీనిద్వారా వైరస్​ ఎక్కడకు ప్రయాణిస్తుందో తెలుస్తుంది. కనుక వైరస్​పై పోరాటం చెయ్యాలంటే వైద్య పరీక్షలు గణనీయంగా పెంచాల్సిందే."

- రాహుల్​ గాంధీ, కాంగ్రెస్​ నేత

రాహుల్​ ప్రెస్​మీట్​ హైలైట్స్:

  • దేశంలో వ్యూహాత్మకంగా వైద్య పరీక్షలు జరగడంలేదు.
  • కేరళలో జిల్లా స్థాయి వైద్య పరికరాలతో సమర్థంగా కట్టడి చేస్తున్నారు.
  • కరోనా నిర్ధరణ పరీక్షలను ర్యాండమ్‌ పద్ధతిలో నిర్వహించాలి.
  • కరోనాపై కలిసికట్టుగా పోరాటం చేయాల్సిన అవసరం ఉంది.
  • లాక్‌డౌన్‌ ఎత్తివేస్తే మళ్లీ కరోనా కేసులు వచ్చే అవకాశం ఉంటుంది.
  • దేశంలో పది లక్షల మందిలో 199 మందికే పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇది ఎంతమాత్రం సరిపోదు
  • కరోనా భూతాన్ని ఓడించేందుకు అన్ని వనరులను ఉపయోగించుకోవాలి. రాష్ట్రాలకు అవసరమైన మేరకు సాయం అందించాలి.
  • వలస కార్మికుల విషయంలో ప్రభుత్వం ఓ వ్యూహం ప్రకారం పనిచేయాల్సి ఉంది.
  • కరోనా వల్ల కలిగే ఆర్థిక నష్టాన్ని ఎదుర్కొనేందుకు సరైన వ్యూహాలు రచించాలి.

ఇదీ చూడండి:పిజ్జా డెలివరీ బాయ్‌కు కరోనా- 72 కుటుంబాలు నిర్బంధం

ABOUT THE AUTHOR

...view details