కరోనా లాక్డౌన్ నేపథ్యంలో రచయిత్రి సుధామూర్తి(ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి భార్య) పిల్లలకు అద్భుత కానుక ఇవ్వనున్నారు. తాను రాసిన పుస్తకాన్ని ఆడియో రూపంలోకి మార్చనున్నట్లు తెలిపారామె. లాక్డౌన్ సందర్భంగా చిన్నారులు సమయాన్ని సద్వినియోగం చేసుకునేలా ఈ పుస్తకం.. వారిలో కొత్త ఆలోచనల్ని రేకెత్తిస్తుందని ఆమె అన్నారు. నూతన ఆవిష్కరణలకు కూడా ఈ ఆడియో ఫార్మాట్స్ తోడ్పడతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.
పిల్లలకు సంబంధించి సుధామూర్తి రచించిన పుస్తకాల్లో ఇది రెండోది. 'హౌ ద ఆనియన్ గాట్ ఇట్స్ లేయర్స్?' పుస్తకంలో ఉల్లిపాయల్ని కట్ చేసేటప్పుడు కన్నీళ్లు ఎందుకొస్తాయనే వంటి ప్రశ్నలకు సోదాహరణంగా సమాధానాలు లభిస్తాయి.