'స్ట్రీట్ ఆఫ్ చెన్నై' పేరుతో ఓ యువ సంగీత బృందం చెన్నై వాసులను వారాంతాలలో అలరిస్తోంది. జనాలు ఎక్కువగా ఉండే ప్రదేశాలలో తమకు ప్రవేశం ఉన్న కళలతో ప్రజలను అలరిస్తున్నారు. గిటార్, కీ బోర్డ్, డ్రమ్స్ వంటి వాద్యాలలో ప్రావీణ్యం పొందిన ఓ మిత్ర బృందం... ఈ విధంగా తమ అభిరుచిని చాటుకుంటోంది.
మజిలీలో 'స్ట్రీట్ ఆఫ్ చెన్నై' సంగీత మాయాజాలం - స్ట్రీట్ ఆఫ్ చెన్నై పేరుతో ఓ యువ సంగీత బృందం
చెన్నై వాసులను ఓ యువ సంగీత బృందం అలరిస్తోంది. బహిరంగ ప్రదేశాల్లో తమ కళలతో ప్రజలను ఆకట్టుకుంటోందీ మిత్రబృందం. 'స్ట్రీట్ ఆఫ్ చెన్నై' పేరుతో తమ అభిరుచిని చాటుకుంటోంది.
'మీరెక్కుడుంటే అక్కడికే వస్తాం.. సంగీతంతో మెప్పించేస్తాం!'
'స్ట్రీట్ ఆఫ్ చెన్నై' పేరుతో వీరికి ఓ ఫేస్బుక్ గ్రూప్ ఉంది. వివిధ బహిరంగ ప్రదేశాలలో తమ ప్రదర్శనల కోసం సంబంధిత అధికారుల అనుమతి కూడా తీసుకుంటున్నారు. చెన్నై బీచ్, షాపింగ్ మాల్స్, రైల్వే స్టేషన్ వంటి బహిరంగ ప్రదేశాల్లో ఈ బృందం ప్రదర్శనలిస్తోంది.
ఇదీ చదవండి:ప్రాచీన కళకు ప్రాణం పోస్తూ.. భావితరాలకు అందిస్తూ..
Last Updated : Dec 22, 2019, 5:01 PM IST