ETV Bharat / bharat

ప్రాచీన కళకు ప్రాణం పోస్తూ.. భావితరాలకు అందిస్తూ.. - kangra art painting in himachal pradesh

హిమాచల్​ప్రదేశ్​లో ఓ పాఠశాల.. ప్రాచీన 'కాంగ్​ఢా' చిత్రకళను భావితరాలకు అందించేందుకు కృషి చేస్తోంది. కేవలం ప్రకృతి ఒడిలో దొరికే సహజసిద్ధమైన పదార్థాలను ఉపయోగించి ఈ చిత్రాలను గీయడం విశేషం. మరి ఈ చిత్రకళ విశేషాలేంటో చూద్దామా!

kangra
ప్రాచీన చిత్రకళకు ప్రాణం పోసిన కళాకారుడు
author img

By

Published : Dec 22, 2019, 6:33 AM IST

Updated : Dec 22, 2019, 4:46 PM IST

ప్రాచీన కళకు ప్రాణం పోస్తూ.. భావితరాలకు అందిస్తూ..

హిమాచల్​ప్రదేశ్​లో అత్యంత ప్రాచుర్యం పొందిన ప్రకృతి సిద్ధమైన చిత్రకళ 'కాంగ్​ఢా'. ఈ చిత్రకళను భావి తరాలకు అందించాలని ఓ పాఠశాల నిర్విరామ కృషి చేస్తోంది.

'కాంగ్​ఢా' చిత్రకళ హిమచల్​ప్రదేశ్​ ప్రాచీన కళారూపం. దీనిని పహారా, గులేర్​ అని కూడా పిలుస్తారు. ఆ రాష్ట్ర సాంస్కృతిక, సామాజిక, భాష, వారసత్వాన్ని ఈ కాంగ్​ఢా చిత్రాలు ఉట్టిపడేలా చేస్తాయి.

ఎందుకింత ప్రత్యేకత?

కాంగ్​ఢా చిత్రకళ అత్యంత ప్రాచుర్యం పొందటానికి కారణం వాటి సహజత్వం. ప్రకృతిలో లభ్యమయ్యే సహజసిద్ధ పదార్థాలతో తయారు చేసిన రంగులను మాత్రమే ఇందులో వాడటం విశేషం. ఆకులు, రాళ్లు, బురద, విత్తనాలు, పువ్వులు, మూలికలు వంటి పదార్థాలతో రంగులను తయారుచేసి వినియోగిస్తారు. చిత్రాన్ని గీయడానికి ఉడత వెంట్రుకలతో తయారుచేసిన బ్రష్​ను ఉపయోగించటం మరో ప్రత్యేకత. అందుకే ఈ కాంగ్​ఢా చిత్రపటాలు వీక్షకులను విశేషంగా ఆకర్షిస్తాయి.

ప్రక్రియ

ఈ చిత్రాల్ని గీయటానికి ముందుగా ఓ కాగితంపై తెల్లటి పదార్థంతో పూత పూస్తారు. అనంతరం ఆ పేపర్​ను మెరిసేలా చేయటానికి శంఖంతో రాపిడి చేస్తారు. ఇలా చేయటం వల్ల కాగితం బలంగా, ఎక్కువ కాలం ఉంటుంది.

ఎలా ప్రాచుర్యం?

17-19 శతాబ్దాల మధ్య రాజ్​పుత్ర చక్రవర్తులు ఈ కళ అభివృద్ధికి కృషి చేశారని సమాచారం. గులేర్, బసోహ్లీ, చంబా, నూర్​పుర్, బిలాస్​పుర్ వంటి ప్రాంతాల్లో కాంగ్​ఢా కళ విలసిల్లిందని చరిత్రకారులు చెబుతున్నారు. అయితే 18 శతాబ్దంలో కాంగ్​ఢా జిల్లాలోని గులేర్​ ప్రాంతంలో ఈ కళ మరింత వెలుగులోకి వచ్చింది. కశ్మీర్​ నుంచి వలసవచ్చిన మొగల్​ చిత్రకారుడు ఇక్కడ స్థిరపడ్డాడు. అతని నుంచే ఈ సహజసిద్ధమైన చిత్రకళ ప్రపంచానికి తెలిసిందట.

కాంగ్​ఢా చిత్రకారులు తొలుత రాజుల చిత్రపటాలు, ప్రేమకు నిదర్శనంగా ఉండే రాధాకృష్ణ చిత్రపటాలను చిత్రించేవారు. భారతీయ చిత్రకారుడు మోలా రామ్​ ఈ కాంగ్​ఢా కళ అభివృద్ధికి విశేష కృషి చేశారు. ప్రస్తుతం 'కాంగ్​ఢా స్కూల్ ఆఫ్ పెయింటింగ్' ఈ కళ అభివృద్ధికి పాటుపడుతోంది.

"నేను ఈ వృత్తిలోకి వచ్చి 32 ఏళ్లైంది. ఒక్కో చిత్రాన్ని గీయటానికి, నేర్చుకోవటానికి చాలా సమయం పడుతుంది. పెద్ద చిత్రాలు గీయడానికి నెలల సమయం పడుతుంది. మా తరంలో గురుకులం విధానంలో కాంగ్​ఢా కళ నేర్పించటానికి పాఠశాలలు ఉండేవి. అదే విధంగా ప్రభుత్వం కాంగ్​ఢా, ధర్మశాల ప్రాంతాల్లో పాఠశాలలు ఏర్పాటుచేసి ప్రోత్సహిస్తే ఈ చిత్రకళను మరింత మంది నేర్చుకోవటానికి అవకాశం ఉంటుంది."

-ముఖేష్​ దీమన్​, చిత్రకారుడు

ఇదీ చూడండి : 'హింసను సృష్టించకండి.. ఎవ్వరినీ వదలం'

RESTRICTIONS: SNTV clients only. Use on broadcast and digital channels, including social. Available worldwide, excluding USA, Canada, UK and Eire. All clients in Germany and Austria are required to provide 5 (five) second courtesy credit "Bilder von Sky Sports". Max use 90 seconds for all clients in New Zealand, Germany, Austria and France. Otherwise, max use 2 minutes. No use prior to and/or during Sky Germany's live broadcast of the respective event. Use within 48 hours. No archive. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
BROADCAST: Scheduled news bulletins only. No use in magazine shows.
DIGITAL: Standalone digital clips allowed. If using on digital or social channels, territorial restrictions must be adhered to by use of geo-blocking technologies.
SHOTLIST: RACV Royal Pines Resort, Gold Coast, Queensland, Australia. 21st December 2019.
++++SHOTLIST AND FURTHER INFORMATION TO FOLLOW++++
1.
2.
3.
4.
5.
6.
7.
8.
9.
10.
SOURCE: European Tour Productions
DURATION: 02:14
STORYLINE:
Last Updated : Dec 22, 2019, 4:46 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.