అంతర్జాతీయ మహిళా దినోత్సవం నాడు కీలక నిర్ణయం తీసుకుంది భారత వాయుసేన. పురుషులతో సమానంగా కదనరంగంలో ప్రత్యర్థులపై విరుచుకుపడేందుకు తొలిసారి ఓ మహిళకు అనుమతి ఇచ్చింది.
బాంబులు వేయడం, ఎగురుతున్న విమానంలో నుంచి పారాషూట్ సాయంతో దూకడం వంటి సాహసోపేత విధులు నిర్వర్తించేందుకు స్క్వాడ్రన్ లీడర్ కవితా బరాలాకు పచ్చజెండా ఊపింది. భారత వాయుసేనలో ఈ ఘనత దక్కించుకున్న తొలి మహిళా నేవిగేటర్గా గుర్తింపు పొందారు కవిత.