ఛత్తీస్‌గఢ్‌లోని నక్సల్ ప్రభావిత ప్రాంతం దంతెవాడలోని బెంగళూరు గ్రామంలో ఏడో తరగతి చదువుతున్నాడు మడారామ్ కవాసీ. చిన్నతనం నుంచి వైకల్యంతో బాధపడుతున్నాడు. కవాసీ రెండు కాళ్లూ చచ్చుబడ్డాయి. చికిత్సకు తల్లిదండ్రులు ప్రయత్నించినా ఆర్థిక పరిస్థితుల వల్ల సాధ్యపడలేదు.
కానీ క్రికెట్ అంటే అమితంగా ఇష్టపడతాడు కవాసీ. ఇందుకు తన వైకల్యం బలహీనతగా అతను భావించలేదు. బ్యాటింగ్, బౌలింగ్‌తో పాటు వేగంగా పరిగెడుతూ అందర్నీ ఆశ్చర్యపరుస్తున్నాడు. ఇది చూసిన తన స్నేహితులు.. కవాసీని ఆల్‌రౌండర్‌గా పిలుస్తారు.
"మడారామ్ క్రికెట్ బాగా ఆడతాడు. మేమూ అప్పుడప్పుడు చూస్తుంటాం. అతని వల్ల మా గ్రామం అందరి దృష్టిలో పడింది. ఇందుకు మడారామ్కు కృతజ్ఞతలు. అతను చదువులోనూ ముందుంటాడు."
- ముకేశ్, గ్రామస్థుడు
మడారామ్ ఆడుతున్న వీడియోను చూసిన క్రికెట్ దిగ్గజం సచిన్ తెందూల్కర్ ట్విట్టర్లో పోస్ట్ చేశాడు. ఈ వీడియో విపరీతంగా వైరల్ కావటం వల్ల అతని ప్రతిభ బయటపడింది.