తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'ఉప' ఫలితం ఎఫెక్ట్​: కీలక పదవికి సిద్ధరామయ్య రాజీనామా

కర్ణాటక కాంగ్రెస్​ శాసనసభాపక్ష నేత పదవికి రాజీనామా చేస్తున్నట్టు సిద్ధరామయ్య ప్రకటించారు. ఉపఎన్నికల్లో పార్టీ ఘోర పరాజయానికి బాధ్యత వహిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు.

Siddaramaiah resigns as CLP leader after Cong poor show in   Assembly byelections
'ఉప' ఫలితం ఎఫెక్ట్​: కీలక పదవికి సిద్ధరామయ్య రాజీనామా

By

Published : Dec 9, 2019, 5:11 PM IST

Updated : Dec 9, 2019, 6:56 PM IST

కీలక పదవికి సిద్ధరామయ్య రాజీనామా

కర్ణాటక ఉపఎన్నికల్లో కాంగ్రెస్​ ఘోర పరాభవానికి బాధ్యత వహిస్తూ.. పార్టీ శాసనసభాపక్ష నేత పదవికి రాజీనామా చేశారు సిద్ధరామయ్య. శాసనసభ ప్రతిపక్ష నేతగానూ తప్పుకుంటున్నట్టు రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వెల్లడించారు. తన రాజీనామా లేఖను కాంగ్రెస్​ అధ్యక్షురాలు సోనియా గాంధీకి పంపినట్టు స్పష్టం చేశారు.

"కాంగ్రెస్​ శాసనసభాపక్ష నేతగా ప్రజాస్వామ్య విలువలను సంరక్షించడం ఎంతో అవసరం. అందువల్ల పార్టీ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని సీఎల్​పీ పదవికి రాజీనామా చేస్తున్నా."
- సిద్ధరామయ్య, కాంగ్రెస్​ సీనియర్​ నేత.

15 నియెజకవర్గాలకు జరిగిన ఉపఎన్నికల్లో 12స్థానాల్లో బరిలో దిగింది కాంగ్రెస్​. వీటిల్లో కేవలం రెండు సీట్లను దక్కించుకోగలిగింది.

సంకీర్ణ ప్రభుత్వం కుప్పకూలిన తర్వాత జరిగిన తొలి ఎన్నికలు కావడం వల్ల ఈ పోరును సిద్ధరామయ్య ఎంతో ప్రతిష్టాత్మకంగా పరిగణించారు. కానీ ఫలితం దక్కలేదు.

ఇదీ చూడండి:- కన్నడనాట భాజపా పీఠం సుస్థిరం- జేడీఎస్​ బేజారు

Last Updated : Dec 9, 2019, 6:56 PM IST

ABOUT THE AUTHOR

...view details