తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కరోనా చికిత్సకు సరికొత్త పద్ధతి - కరోనా చికిత్స పరిశోధనలు

శ్వాసకోస సంబంధిత సమస్యలకు సరికొత్త చికిత్సా పద్ధతిని ఆవిష్కరించారు నోయిడాలోని శివ్​నాడార్ వర్సిటీ పరిశోధకులు. తాము కనుగొన్న సంభావ్యత గల రసాయన అణువులతో.. కొవిడ్​ రోగుల్లో తలెత్తే అక్యూట్‌ రెస్పిరేటరీ డిస్ట్రెస్‌ సిండ్రోమ్‌ (ఏఆర్‌డీఎస్‌)నూ తగ్గించొచ్చని తెలిపారు.

new treatment for Corona
కరోనా చికిత్సకు కొత్త పద్ధతి

By

Published : Apr 29, 2020, 8:44 AM IST

దిల్లీ శివారు నోయిడాలోని శివ్‌నాడార్‌ వర్సిటీ పరిశోధకులు సరికొత్త చికిత్స పద్ధతిని ఆవిష్కరించారు. కరోనా వైరస్‌ ద్వారా రోగుల్లో తలెత్తే అక్యూట్‌ రెస్పిరేటరీ డిస్ట్రెస్‌ సిండ్రోమ్‌(ఏఆర్‌డీఎస్‌)ను తాము కనుగొన్న సంభావ్యత గల రసాయన అణువులతో తగ్గించవచ్చునని ప్రకటించారు.

వర్సిటీ రసాయన శాస్త్ర విభాగం ఆచార్యుడు సుభబ్రత సేన్‌ నేతృత్వంలోని బృందం ఈ పరిశోధనను చేపట్టింది. ఈ ఏడాది చివరికల్లా ప్రీ క్లినికల్‌ అధ్యయనాలను పూర్తిచేసి, ఆ తర్వాత మనుషులపై ప్రయోగాలను సిద్ధమవుతామని ఆయన చెప్పారు. కరోనానే కాకుండా సార్స్‌, మెర్స్‌ ద్వారా వచ్చే శ్వాసపరమైన ఇబ్బందులకూ సంభావ్యత రసాయన అణువులతో చక్కని చికిత్సను అందించవచ్చునని వర్సిటీ పరిశోధకులు పేర్కొన్నారు. ఈ విధానంపై పేటెంట్‌ కోసం దరఖాస్తు చేసుకున్నట్లు తెలిపారు.

ఇదీ చూడండి:తస్మాత్​ జాగ్రత్త.. మురుగునీటి పైపులు ద్వారా కరోనా

ABOUT THE AUTHOR

...view details