దిల్లీ షహీన్‌బాగ్ నిరసనలపై కేంద్రమంత్రి రవి శంకర్ ప్రసాద్ మండిపడ్డారు. ప్రశాంతంగా జీవిస్తున్న మెజారిటీలను అణచివేసేందుకు కొందరు చేస్తున్న కుట్రగా ఈ నిరసనలను అభివర్ణించారు.
"షహీన్‌బాగ్ ఘటన ఎంతో విచారకరం. భారత జెండా, రాజ్యాంగం, భారతీయులను విభజించడానికి ప్రయత్నిస్తున్న వారు ఇక్కడ ఆశ్రయం పొందుతున్నారు. తుక్డే తుక్డే గ్యాంగ్ వీరి వెనక ఉంటుంది. ప్రశాంతంగా నివసిస్తున్న మెజారిటీ ప్రజలను అణచివేయడానికి కొందరు ప్రయత్నిస్తున్నారు. శాంతియుతంగా ఉన్న మెజారిటీలను వందల మంది అణచివేసేందుకు జరిగే కుట్రకు ఉదాహరణగా షహీన్‌బాగ్ ఆవిర్భవిస్తోంది. వీరు సీఏఏకు విరోధులు కారు... వీరందరు ప్రధాని మోదీకి విరోధులు. ప్రశాంతంగా జీవిస్తున్న లక్షలాది మంది గళం మీకు ఎందుకు వినపడట్లేదు? వారి పిల్లలు పాఠశాలలకు వెళ్లలేకపోతున్నారు. ఉద్యోగాలు చేసుకోలేకపోతున్నారు. కనీసం అంబులెన్స్‌కు కూడా దారిలేకుండాపోయింది."
- రవిశంకర్ ప్రసాద్, కేంద్రమంత్రి.