తెలంగాణ

telangana

By

Published : Jan 7, 2020, 4:30 PM IST

ETV Bharat / bharat

'ఇలాంటి క్రూర రాజకీయాలు ఎన్నడూ చూడలేదు'

జేఎన్​యూలో విద్యార్థులపై జరిగిన దాడిపై శివసేన తీవ్రంగా స్పందించింది. పౌరసత్వ చట్టం తీసుకొచ్చి ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్​ షా అల్లర్లను ప్రేరేపిస్తున్నారని మండిపడింది. ఇలాంటి క్రూరమైన రాజకీయాలు దేశంలో మునుపెన్నడూ చూడలేదని పేర్కొంది.

Sena slams Modi-Shah, says such 'brutal politics' never seen   before
'ఇలాంటి క్రూర రాజకీయాలు ఎన్నడూ చూడలేదు'

జేఎన్​యూలో విద్యార్థులపై జరిగిన దాడిపై తీవ్రంగా స్పందించింది శివసేన. పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా ఆందోళనలు చేసిన వారిపై పగ తీర్చుకునేందుకే భాజపా ఈ దాడులు చేయించిందని ఆరోపించింది. జేఎన్​యూ ఘర్షణలను ముంబయిలో 26/11 ఉగ్రదాడి తరహా ఘటనగా అభివర్ణించింది. భాజాపా చేసే విభజన రాజకీయాలు దేశానికి ప్రమాదమని అధికారిక పత్రిక సామ్నా సంపాదకీయంలో వ్యాఖ్యానించింది.

జవహర్​లాల్​ నెహ్రూ విశ్వవిద్యాలయంలోని మూడు హాస్టళ్లలోకి కొంతమంది ముసుగులు ధరించి వచ్చి విద్యార్థులపై ఇనుపరాడ్లతో దాడి చేశారని, వర్సిటీ ఆస్తులను ధ్వంసం చేశారని శివసేన పేర్కొంది. 34 మంది గాయపడిన ఈ ఘటనకు పాల్పడిన వారిపై కేంద్ర హోంమంత్రిత్వ శాఖ కేసు నమోదు చేయకుండా గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారంటూ అనడం హాస్యాస్పదంగా ఉందని పేర్కొంది. విశ్వవిద్యాలయాలు, కళాశాలల్లో ఇంతలా రక్తపాతం చోటుచేసుకోడం ఇదివరకెప్పుడూ చూడలేదని సామ్నాలో రాసుకొచ్చింది శివసేవ.

''పౌరచట్టాన్ని తీసుకొచ్చి అల్లర్లు, హింసను ప్రేరేపించాలని భాజాపా భావించింది. అయితే అది జరగలేదు. సీఏఏకు వ్యతిరేకంగా ముస్లింలు మాత్రమే ఉద్యమించలేదు. హిందువులూ పౌరచట్టాన్ని వ్యతిరేకించారు. ప్రస్తుతం భాజపా ఒకవైపు.. మిగతా పార్టీలు మరోవైపు ఉన్నాయి. ఈ క్రమంలో ప్రతీకారం తీర్చుకునేందుకే కమలం పార్టీ జేఎన్​యూలో దాడులకు పూనుకుంది."
- సామ్నా పత్రికలో శివసేన

హింసను ప్రేరేపిస్తున్నది ఎవరు?

వర్సిటీల్లో చెలరేగిన హింసను భాజపా ఖండించడం, విశ్వవిద్యాలయాలు రాజకీయాలకు దూరంగా ఉండాలని అనడంపై మండిపడింది శివసేన. ఐదు సంవత్సరాలుగా 'వర్సిటీల్లో రాజకీయాలు చేస్తున్నది.. హింసకు పాల్పడుతున్నది ఎవరు? అని ప్రశ్నించింది. తమ సిద్ధాంతాలను అనుసరించని వారిని అధికారాన్ని అడ్డుపెట్టుకొని నాశనం చేయాలనుకున్నదని ఎవరు ?' అని ప్రశ్నలు సంధించింది.

విశ్వవిద్యాలయాల్లో హింసను ప్రేరేపిస్తున్నారని రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీని అమిత్ షా విమర్శిస్తుండటాన్ని శివసేన ఖండించింది. గాంధీ కుటుంబం నుంచి వచ్చిన వాళ్లుగా.. కేంద్రం తీసుకువచ్చిన ప్రజావ్యతిరేక చట్టంపై పోరాటానికి పౌరులను సంఘటితం చేయాల్సిన అవసరం, శక్తి వారికి ఉందని సమాధానం ఇచ్చింది శివసేన.

ఇదీ చూడండి:ముథూట్ ఎండీపై దాడి... ఎవరి పని?


ABOUT THE AUTHOR

...view details