తెలంగాణ

telangana

ETV Bharat / bharat

రూ.70 కోసం ఘర్షణ.. పసి బాలుడు మృతి - తిరుచ్చి

తమిళనాడు తిరుచ్చి జిల్లాలో దారుణం జరిగింది. రూ.70 వద్ద మొదలైన గొడవ ఓ 15 నెలల బాలుడి మృతికి కారణమయింది.

పసి బాలుడు మృతి

By

Published : Jul 2, 2019, 5:31 PM IST

తమిళనాడు తిరుచ్చి జిల్లా కాలుపట్టి నివాసి రంజన్​. తన స్నేహితులు ఆనంద్​, సెంథిల్​తో ముచ్చటించేందుకు వెళ్లగా రూ. 70 కోసం వారి మధ్య వాగ్వివాదం జరిగింది. ఘర్షణలో రంజన్​ చేతిలో ఉన్న తన 15నెలల కొడుకు నిత్యేశ్వరణ్​ మరణించాడు.

అసలు ఏం జరిగిందంటే..

సాయంత్రం వేళ మిత్రులు ఆనంద్​, సెంథిల్​తో మాట్లాడేందుకు నిత్యేశ్వరణ్​తో కలిసి రంజన్​ వెళ్లాడు. ఈ సమయంలో ఆనంద్​ వద్ద నుంచి సెంథిల్​ రూ.70 దొంగలించటంపై చర్చ వివాదానికి దారి తీసింది.

ఈ ఘర్షణలో రంజన్​ను కర్రతో కొట్టేందుకు సెంథిల్​ చేసిన ప్రయత్నంలో బాలుడికి బలంగా దెబ్బ తగిలింది. స్పృహ కోల్పోయిన బాలుణ్ని తిరుచ్చి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినా ఫలితం దక్కలేదు.

ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. సెంథిల్​ను అరెస్టు చేశారు. రూ.70 కోసం జరిగిన గొడవలో బాలుడు మరణించటం వల్ల గ్రామంలో విషాదం అలుముకుంది.

ఇదీ చూడండి: మహారాష్ట్ర: భారీ వర్షాలకు 30 మంది మృతి

ABOUT THE AUTHOR

...view details