తెలంగాణ

telangana

ETV Bharat / bharat

చిదంబరం పిటిషన్లపై నేడు సుప్రీం విచారణ - ఐఎన్​ఎక్స్

మనీ లాండరింగ్ కేసులో తనకు బెయిల్ నిరాకరిస్తూ దిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ కేంద్ర మాజీ మంత్రి పి. చిదంబరం దాఖలు చేసిన  పిటిషన్​ను నేడు సుప్రీం విచారించనుంది. చిదంబరానికి సంబంధించిన మూడు కేసులను నేడే విచారించాలని సుప్రీం నిర్ణయించింది.

చిదంబరం పిటిషన్లపై నేడు సుప్రీం విచారణ

By

Published : Aug 26, 2019, 5:10 AM IST

Updated : Sep 28, 2019, 7:00 AM IST

చిదంబరం పిటిషన్లపై నేడు సుప్రీం విచారణ

ఐఎన్​ఎక్స్​ మీడియా మనీలాండరింగ్​ కేసులో కేంద్రమాజీ మంత్రి పి. చిదంబరానికి... ముందస్తు బెయిల్ నిరాకరిస్తూ దిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ దాఖలు చేసిన పిటిషన్​ను నేడు విచారించనుంది సుప్రీంకోర్టు.

తన అరెస్టును సవాలు చేస్తూ చిదంబరం దాఖలు చేసిన మరో వ్యాజ్యాన్ని జస్టిస్​ ఆర్​. భానుమతి నేతృత్వంలోని ధర్మాసనం విచారించనుంది. సోమవారం వరకు కస్టడీకి అప్పగించిన సీబీఐ న్యాయస్థానం ఆదేశాలను ఈ పిటిషన్​లో సవాలు చేశారు చిదంబరం.

ఐఎన్​ఎక్స్​ మీడియా మనీలాండరింగ్ కేసులో అరెస్టు నుంచి మధ్యంతర రక్షణను కల్పిస్తూ శుక్రవారం నిర్ణయం తీసుకుంది సుప్రీం. చిదంబరం పిటిషన్​కు ఎన్​ఫోర్స్​మెంట్ డైరెక్టరేట్ వివరణ ఇవ్వాలని.. ఆయనకు సంబంధించిన మూడు అంశాలకు సోమవారమే సమాధానమివ్వాలని సుప్రీం ఆదేశించింది.

తన వ్యవహారంలో ఆర్టికల్ 21 ప్రకారం ప్రాథమిక హక్కులకు భంగం కలిగిందని పిటిషన్​లో పేర్కొన్నారు చిదంబరం. హైకోర్టు నిర్ణయాన్ని సవాలు చేస్తూ జులై 20, 21న తాను వ్యాజ్యాన్ని దాఖలు చేయగా సుప్రీం కోర్టు విచారణ చేపట్టలేదని వెల్లడించారు. ఆగస్టు 21 రాత్రి అరెస్టు చేయడంపై అభ్యంతరం తెలిపారు.

ఈడీ తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించారు. పిటిషనర్ ఆరోపిస్తున్నట్లుగా రాజకీయ కక్షసాధింపుతో అరెస్ట్​ చేయలేదని.. ఇది బాధ్యతాయుతంగా చేపట్టిందన్నారు.

"ఇంద్రాణి ముఖర్జియా స్టేట్​మెంట్​ను సీబీఐ నమోదు చేసింది. విదేశీ పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు అనుమతుల కోసం చిదంబరం వద్దకు ఇంద్రాణి, ఆమె భర్త వెళ్లారని విచారణలో వెల్లడైంది. ఇందుకు ప్రతిఫలంగా ఆయన తన కుమారుడిని చూసుకోవాల్సిందిగా కోరినట్లు ఇంద్రాణి తెలిపారు. "

- కోర్టులో వాదనల సందర్భంగా తుషార్ మెహతా

చిదంబరం ఆర్థికమంత్రిగా ఉన్న సమయంలో ఐఎన్​ఎక్స్​ మీడియా గ్రూపు రూ. 305 కోట్ల విదేశీ నిధులను అక్రమంగా పొందిందన్న ఆరోపణలతో 2017 మే 15న సీబీఐ ఛార్జీషీటు దాఖలు చేసింది. అనంతరం ఈడీ మనీలాండరింగ్ కేసు నమోదు చేసింది.

ఇదీ చూడండి: శ్రీనగర్​ సచివాలయంపై జమ్ముకశ్మీర్​ జెండా తొలగింపు

Last Updated : Sep 28, 2019, 7:00 AM IST

ABOUT THE AUTHOR

...view details