మైనార్టీలను జాతీయ స్థాయి గణాంకాల ఆధారంగా కాకుండా రాష్ట్ర స్థాయి గణాంకాల ప్రకారం గుర్తించాలని దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై సుప్రీం కోర్టు విచారణ చేపట్టింది. ఈ పిటిషన్పై అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ సాయం కోరింది.
భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగొయి నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం వ్యాజ్యాన్ని విచారించింది. వ్యాజ్యం దాఖలు చేసిన భాజపా నేత, న్యాయవాది అశ్వినీకుమార్ ఉపాధ్యాయ.. పిటిషన్ కాపీలను అటార్నీ జనరల్ కార్యాలయానికి అందించాలని ఆదేశించింది. దీనిపై నాలుగు వారాల తరువాత విచారణ చేపట్టనున్నట్లు వెల్లడించింది.
మైనార్టీ వర్గాలను గుర్తించడంలో జాతీయ స్థాయి గణాంకాలను పరిగణనలోకి తీసుకోవడం సరికాదని సీనియర్ న్యాయవాది ముఖుల్ రోహత్గీ సర్వోన్నత న్యాయస్థానానికి తెలిపారు.