తెలంగాణ

telangana

By

Published : Sep 30, 2019, 11:19 AM IST

Updated : Oct 2, 2019, 1:51 PM IST

ETV Bharat / bharat

రాజ్యాంగ ధర్మాసనం ముందుకు 'కశ్మీర్​' వ్యాజ్యాలు

రాజ్యాంగ ధర్మాసనం ముందుకు 'కశ్మీర్​' వ్యాజ్యాలు

11:12 September 30

రాజ్యాంగ ధర్మాసనం ముందుకు 'కశ్మీర్​' వ్యాజ్యాలు

ఆర్టికల్ 370 రద్దు నేపథ్యంలో జమ్ముకశ్మీర్​కు సంబంధించి దాఖలైన వేర్వేరు వ్యాజ్యాలను రాజ్యాంగ ధర్మాసనానికి అప్పగించింది సుప్రీంకోర్టు. ఆర్టికల్​ 370 రద్దును సవాలు చేసిన పిటిషన్లతోపాటు ఈ వ్యాజ్యాలపై ఐదుగురు సభ్యుల ధర్మాసనం మంగళవారం నుంచి విచారణ జరుపుతుందని న్యాయస్థానం స్పష్టంచేసింది.

ఆర్టికల్​ 370 రద్దు నేపథ్యంలో సమాచార వ్యవస్థపై విధించిన ఆంక్షలు ఎత్తివేయాలన్న వ్యాజ్యం, కొందరు చిన్నారుల్ని అక్రమంగా అదుపులోకి తీసుకున్నారని ఆరోపిస్తూ దాఖలైన పిటిషన్​పై రాజ్యాంగ ధర్మాసనం విచారణ చేపట్టనుందని సుప్రీంకోర్టు స్పష్టంచేసింది.

రాజ్యాంగ ధర్మాసనం...

జమ్ము కశ్మీర్​ స్వయంప్రతిపత్తి రద్దుపై దాఖలైన వ్యాజ్యాలను విచారించేందుకు ఈనెల 28న జస్టిస్​ ఎన్వీ రమణ నేతృత్వంలో ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనాన్ని ఏర్పాటు చేసింది సుప్రీంకోర్టు. జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, జస్టిస్ సుభాష్ రెడ్డి, జస్టిస్​ బీఆర్ గవాయ్, జస్టిస్ సూర్యకాంత్ ఇందులో సభ్యులు. 
 

Last Updated : Oct 2, 2019, 1:51 PM IST

ABOUT THE AUTHOR

...view details