తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఆప్రికా చిరుతలకు అనువైన ప్రాంతం ఎంపికకు సుప్రీం అనుమతి - three-member committee,

ఆఫ్రికా చిరుతలను మనదేశంలో అనువైన వాతావరణంలో సంరక్షించేందుకు కేంద్రానికి సుప్రీంకోర్టు అనుమతించింది. నమీబియా నుంచి చిరుతలను తీసుకువచ్చేందుకు అనుమతి ఇవ్వాలని జాతీయ పులుల సంరక్షణ సంస్థ( ఎన్​టీసీఏ) సుప్రీంను కోరిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది.

sc-allows-centre-to-bring-african-cheetah-to-suitable-wildlife-habitat-in-india
చిరుత సంరక్షణకు ముగ్గురు సభ్యుల కమిటీ ఏర్పాటు: సుప్రీం

By

Published : Jan 28, 2020, 1:44 PM IST

Updated : Feb 28, 2020, 6:50 AM IST

ఆఫ్రికా చిరుతలు జీవించేందుకు అనువైన వాతావరణ ప్రాంతాన్ని ఎంచుకునేందుకు కేంద్రానికి అనుమతిచ్చింది సుప్రీం కోర్టు. అరుదైన భారతీయ చిరుతలు దాదాపుగా అంతరించినందున.. నమీబియా నుంచి ఆఫ్రికా చిరుతలను తీసుకువచ్చేందుకు అనుమతించాలని జాతీయ పులుల సంరక్షణ సంస్థ (ఎన్​టీసీఏ) సుప్రీంకోర్టుకు దరఖాస్తు చేసింది.

దీనిపై విచారణ జరిపిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్​.ఏ.బోబ్డే నేతృత్వంలోని సుప్రీం ధర్మాసనం.... నమీబియా నుంచి ఆఫ్రికా చిరుతలను తీసుకురావడానికి మార్గనిర్దేశం చేసేందుకు ముగ్గురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేసింది. ఆఫ్రికా చిరుతను పెంచే ప్రదేశంపై తగిన సర్వే అనంతరం నిర్ణయం తీసుకుంటామని సుప్రీంకోర్టు తెలిపింది. సర్వే కోసం కూడా ఎన్​టీసీఏకు ముగ్గురు సభ్యుల కమిటీ మార్గనిర్దేశం చేస్తుందని స్పష్టం చేసింది.

ఇదీ చూడండి: మరిన్ని దేశాలకు 'కరోనా'- భారత్​లో పెరిగిన కేసులు

Last Updated : Feb 28, 2020, 6:50 AM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details