ETV Bharat / bharat

మరిన్ని దేశాలకు 'కరోనా'- భారత్​లో పెరిగిన కేసులు - corona virus updates

కరోనా వైరస్ మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తోంది. ఈ వ్యాధి కారణంగా చైనాలో ఇప్పటివరకు 106మంది మరణించారు. కెనడా, శ్రీలంక, జర్మనీ దేశాల్లో కరోనా వైరస్ తొలి కేసులు నమోదయ్యాయి. చైనాకు వెళ్లే ముందు ఆలోచించుకోవాలని ప్రజలను అప్రమత్తం చేసింది అగ్రరాజ్యం. భారత్​లోనూ పలు రాష్ట్రాల్లో కరోనా అనుమానిత కేసులు నమోదయినప్పటికీ అధికారికంగా ఒక్క కేసునూ ధ్రువీకరించలేదు.

Corona virus spread across world
మరిన్ని దేశాలకు 'కరోనా'- భారత్​లో పెరిగిన కేసులు
author img

By

Published : Jan 28, 2020, 11:29 AM IST

Updated : Feb 28, 2020, 6:27 AM IST

ప్రాణాంతక కరోనా వైరస్ ప్రపంచ దేశాలను గడగడలాడిస్తోంది. చైనా వుహాన్ నుంచి వ్యాప్తి చెందిన ఈ మహమ్మారి ధాటికి ఆ దేశంలో ఇప్పటి వరకు 106మంది ప్రాణాలు కోల్పోయారు. 2,744 మంది ఈ వ్యాధి బారిన పడ్డారని, కొత్తగా మరో 1300 కేసులు నమోదైనట్లు డ్రాగన్ దేశం తెలిపింది. వ్యాధి నియంత్రణకు ప్రయాణ అంక్షలు విధించింది.

జర్మనీ, శ్రీలంకకు వ్యాప్తి

జర్మనీలోని దక్షిణ బెవేరియన్ ప్రాంతంలో ఒకరికి ఈ వ్యాధి సోకినట్లు వైద్యాధికారులు ధ్రువీకరించారు. అతడికి ప్రత్యేక వార్డులో చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు.
చైనా నుంచి తమ దేశం వచ్చిన 40ఏళ్ల మహిళకు కరోనా వైరస్ సోకినట్లు వైద్య పరీక్షలో తేలిందని శ్రీలంక ఆరోగ్యమంత్రిత్వ శాఖ అధికారులు వెల్లడించారు. జనవరి 19న పర్యటనకు వచ్చిన ఆమె తిరిగి 25న వెళ్తుండగా విమానాశ్రయంలో వైద్య పరీక్షలు చేసి గుర్తించినట్లు చెప్పారు.
కరోనా వ్యాప్తి నియంత్రణలో భాగంగా చైనా నుంచి వచ్చే పర్యటకులకు వీసా ఆన్ అరైవల్​ విధానాన్ని రద్దు చేస్తున్నట్లు శ్రీలంక ప్రభుత్వం ప్రకటించింది.

కెనడాలో తొలికేసు

కెనాడాలో తొలి కరోనా కేసు నమోదైనట్లు అధికారులు తెలిపారు. వుహాన్​ నుంచి జనవరి 22న టొరొంటోకు వచ్చిన ఓ వ్యక్తికి వ్యాధి సోకినట్లు నిర్ధరించారు. అతని భార్యకు కూడా వైద్య పరీక్షల్లో పాజిటివ్​గా తేలిందని పేర్కొన్నారు.

అమెరికా అప్రమత్తం..

కరోనా వైరస్ ప్రపంచ దేశాలకు వ్యాపిస్తున్న నేపథ్యంలో తమ దేశ ప్రజలను అప్రమత్తం చేసింది అమెరికా. చైనాకు ప్రయాణించే వారు ఒక్కసారి ఆలోచించుకోవాలని హెచ్చరించింది. చైనాలో వ్యాధికి మూలమైన వుహాన్ ప్రాంతానికి వెళ్లొద్దని సూచించింది.

భారత్​లో పలు అనుమానిత కేసులు

కరోనా వైరస్​ అనుమానిత కేసులు భారత్​లోని పలు ప్రాంతాల్లో నమోదయ్యాయి. ముంబయి, రాజస్థాన్​, కోల్​కతా, దిల్లీలోని పలు ఆస్పత్రులలో ప్రత్యేక వార్డులను ఏర్పాటు చేసి వ్యాధి లక్షణాలున్న వారికి చికిత్స అందిస్తున్నారు. దిల్లీలో ఈరోజు మూడు అనుమానాస్పద కేసులు నమోదైనట్లు అధికారులు తెలిపారు. వీరందరినీ ఆర్​ఎంఎల్ ఆస్పత్రిలో వైద్యుల పర్యవేక్షణలో ఉంచినట్లు చెప్పారు.

థాయ్​లాండ్​ మహిళ మృతి

థాయ్​లాండ్​కు చెందిన ఓ మహిళ.. బంగాల్​ కోల్​కతాలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో మరణించింది. జనవరి 21న కడుపు నొప్పి, జ్వరంతో ఆమె ఆస్పత్రిలో చేరినట్లు అధికారులు తెలిపారు. ఆమెకు కరోనా వ్యాధి లక్షణాలు ఉన్నాయని అనుమానిస్తున్నట్లు ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి.

Intro:Body:

Three kept in observation at RML Hospital for possible exposure to Coronavirus

New Delhi, Jan 28 (PTI) Three persons have been kept under observation at an isolation ward of RML Hospital here for a possible exposure to novel coronavirus, officials said on Tuesday.

The three -- all men aged between 24 and 48 -- were admitted on Monday and their samples have been sent for testing, Dr Minakshi Bhardwaj, Medical Superintendent of RML Hospital, said.

While two of the men are residents of Delhi, one hails from NCR.

Till Monday, a total of 33,552 passengers arriving in India from China in 155 flights have been screened.

Conclusion:
Last Updated : Feb 28, 2020, 6:27 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.