తెలంగాణ

telangana

By

Published : Mar 4, 2020, 11:09 PM IST

ETV Bharat / bharat

మోదీ ఐదేళ్ల విదేశీ పర్యటనల ఖర్చు రూ.446 కోట్లు

ప్రధాని మోదీ విదేశీ పర్యటనల కోసం ఐదేళ్లలో రూ.446.52 కోట్లు ఖర్చయింది. ఈ వివరాలను విదేశాంగశాఖ సహాయమంత్రి లోక్​సభ వేదికగా వెల్లడించారు.

Rs 446.52 crore spent on foreign visits of Prime Minister Modi in last five year
మోదీ ఐదేళ్ల విదేశీ పర్యటనల ఖర్చు రూ.446 కోట్లు

భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విదేశీ పర్యటనల ఖర్చును విదేశాంగ మంత్రిత్వశాఖ వెల్లడించింది. లోక్​సభలో అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ... విదేశాంగశాఖ సహాయమంత్రి వి. మురళీధర్​.. మోదీ అధికారిక పర్యటనలకు వెచ్చించిన సొమ్ము వివరాలను​ తెలియజేశారు. ఐదేళ్లలో రూ. 446.52 కోట్లు ఖర్చయినట్టు తెలిపారు.

ఖర్చులు ఇలా...

  • 2015-16లో రూ.121.85 కోట్లు
  • 2016-17లో రూ.78.52 కోట్లు
  • 2017-18లో రూ.99.90 కోట్లు
  • 2017-18లో రూ.99.90 కోట్లు
  • 2018-19లో రూ.100.02 కోట్లు
  • 2019-20(ఇప్పటివరకు) రూ.46.23 కోట్లు

ఇదీ చదవండి:ఎయిర్​ ఇండియాలో ఎన్​ఆర్​ఐలకు 100శాతం పెట్టుబడులు

ABOUT THE AUTHOR

...view details