తెలంగాణ

telangana

By

Published : Apr 1, 2019, 7:21 AM IST

ETV Bharat / bharat

అప్పుడు ఎంపీ... ఇప్పుడు బీడీ కార్మికుడు

అనతికాలంలోనే కోట్లకు పడగలెత్తిన ప్రజాప్రతినిధులు ఎందరో. వారందరికీ భిన్నం మధ్యప్రదేశ్​కు చెందిన మాజీ ఎంపీ. 82ఏళ్ల వయసులోనూ బీడీలు చుట్టి, ఉపాధి పొందుతున్నారు.

సాధారణ జీవితం గడుపుతున్న మాజీ ఎంపీ

సాధారణ జీవితం గడుపుతున్న మాజీ ఎంపీ
రాజకీయాలు డబ్బుమయం అయ్యాయన్నది అందరి ఆవేదన. అలాంటి రోజుల్లోనూ... మధ్యప్రదేశ్​కు చెందిన మాజీ ఎంపీ సాధారణ జీవితం సాగిస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు.

1967లో భారతీయ జన సంఘ్​ తరఫున సాగర్​ నియోజకవర్గం నుంచి పోటీచేసి గెలుపొందారు రామ్​సింగ్ అహిర్వర్​​. కాంగ్రెస్​ పార్టీ బలంగా ఉన్న రోజుల్లో విజయం సాధించి ఎందరో అగ్రనేతల మన్ననలు పొందారు. ఎంపీగా పనిచేసినా... రామ్​సింగ్​ జీవనశైలిలో ఎలాంటి మార్పు రాలేదు.

ఇదీ చూడండి:భారత్​ భేరి: డబుల్​ ధమాకాపై డీఎంకే గురి

82 ఏళ్ల వయసులోనూ తన కష్టంపైనే ఆధార పడుతున్నారు రామ్​సింగ్​​. సాగర్​లో బీడీలు చుట్టి, పొట్ట నింపుకుంటున్నారు. ఎక్కడికి వెళ్లాలన్నా సైకిల్​నే ఉపయోగిస్తారు. చిన్న ఇంట్లోనే ఉంటున్నారు.

"అప్పట్లో ఎంపీల జీతం రూ. 500 ఉండేది. అక్రమంగా సంపాదించడం సాధ్యం కాదు. అక్రమ సంపాదన నైతిక విలువలకు విరుద్ధం."

--- రామ్​ సింగ్​, మాజీ ఎంపీ

2005 నుంచి రామ్​సింగ్​కు మాజీ ఎంపీగా పింఛను వస్తోంది. ఆ సొమ్ముకు తోడు బీడీలు చుడితే వచ్చిన డబ్బుతో సంతోషంగా జీవిస్తున్నారు రామ్​సింగ్​ దంపతులు.

ఇవీ చూడండి:

"మోదీ ప్రధానమంత్రి కాదు ప్రచారాల మంత్రి"

భారత్​ భేరి: మహారాష్ట్రలో రెండు స్తంభాలాట

ABOUT THE AUTHOR

...view details