కేంద్ర ప్రభుత్వం తీసుకున్న వంటగ్యాస్ సిలిండర్ ధరల పెంపు నిర్ణయంపై విమర్శనాస్త్రాలు సంధించారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. మోదీ సర్కారు తీసుకున్న ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. గతంలో యూపీఏ హయాంలో ఎల్పీజీ సిలిండర్ల ధరల పెంపునకు నిరసనగా కేంద్రమంత్రి స్మృతి ఇరానీతో పాటు ఇతర భాజపా నేతలు చేపట్టిన ఆందోళనలను గుర్తు చేస్తూ ట్వీట్ చేశారు రాహుల్.
"ఎల్పీజీ సిలిండర్‌పై 150 రూపాయల పెంపును నిరసిస్తూ.. భాజపా నేతలు ఆందోళనలు చేయడాన్ని నేను అంగీకరిస్తున్నాను."