తెలంగాణ

telangana

ETV Bharat / bharat

వ్యవసాయ సంస్కరణలను వ్యతిరేకిస్తూ రాహుల్​ పోరుబాట

Kheti Bachao Yatra
రాహుల్​ గాంధీ

By

Published : Oct 4, 2020, 2:22 PM IST

Updated : Oct 4, 2020, 3:21 PM IST

15:19 October 04

'వ్యవసాయ చట్టాలను చెత్తబుట్టలో వేస్తాం'

కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలోకి  వస్తే ఎన్​డీఏ ప్రభుత్వం తీసుకువచ్చిన మూడు వ్యవసాయ సంస్కరణ చట్టాలను రద్దు చేసి చెత్తబుట్టలో వేస్తామని కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ తెలిపారు. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా పంజాబ్‌లోని మోగాలో ఖేతీ బచావో పేరుతో చేపట్టిన ట్రాక్టర్‌ ర్యాలీని ప్రారంభించిన రాహుల్ కేంద్ర ప్రభుత్వం రైతులకు నష్టం చేసే చర్యలను చేపట్టిందని మండిపడ్డారు. పెద్ద పారిశ్రామికవేత్తల రుణాలను మాఫీ చేస్తున్న కేంద్రం.. రైతులను మాత్రం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. 

ఉత్తర్​ ప్రదేశ్‌లోని హాథ్రస్‌లో యువతి అత్యాచారం, మృతిపై మరోసారి స్పందించిన రాహుల్‌... బాధితురాలి కుటుంబానికి న్యాయం చేయకుండా ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌, జిల్లా మేజిస్ట్రేట్‌ ఆమె కుటుంబాన్ని బెదిరిస్తున్నారని విమర్శించారు. వ్యవసాయ సంస్కరణ చట్టాలు రైతుల ప్రయోజనాల కోసమే అయితే పార్లమెంటులో వాటిపై ఎందుకు చర్చించలేదని రాహుల్‌ గాంధీ ప్రశ్నించారు. 

14:05 October 04

ఖేతీ బచావో యాత్ర ప్రారంభం

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ సంస్కరణ చట్టాలకు వ్యతిరేకంగా 'ఖేతీ బచావో (వ్యవసాయాన్ని రక్షించండి) యాత్ర'ను ఆదివారం ప్రారంభించారు కాంగ్రెస్​ నేత రాహుల్​ గాంధీ. పంజాబ్​ నుంచి దిల్లీ వరకు 3 రోజుల పాటు సాగే ఈ యాత్ర మోగా జిల్లాలోని బధ్నికలాన్​ నుంచి ప్రారంభమైంది. ఈ సందర్భంగా బహిరంగ సభలో మాట్లాడిన రాహుల్​ కేంద్రంపై విమర్శలు చేశారు. వ్యవసాయ బిల్లులను రైతులు అంగీకరిస్తే ఎందుకు దేశవ్యాప్తంగా ఆందోళనలు చేస్తున్నారని ప్రశ్నించారు​. పంజాబ్​లోని ప్రతి రైతు ఎందుకు నిరసనల్లో పాల్గొంటున్నారని అన్నారు రాహుల్.

"కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లో ఇలాంటి బిల్లులు తీసుకురావాల్సిన అవసరం ఏముంది? ఎందుకు అంత వేగంగా బిల్లులను ఆమోదింపజేసుకున్నారు.?లోక్​సభ, రాజ్యసభలో బిల్లుల గురించి ఎందుకు చర్చ జరగలేదు. రైతుల శ్రేయస్సు కోసమే బిల్లులు తెచ్చామన్న మోదీ.. ఎందుకు పార్లమెంటులో బహిరంగ చర్చ జరపలేదు".

-- రాహుల్​ గాంధీ, కాంగ్రెస్​ నేత

పంజాబ్​లోని మోగా జిల్లా బధ్నికలాన్‌ నుంచి దిల్లీలోని జత్‌పురా వరకు జరగనుందీ ర్యాలీ. జత్‌పురా సమావేశంలో ప్రసంగంతో తొలిరోజు యాత్ర ముగియనుంది. మూడ్రోజులపాటు సాగనున్న ఈ యాత్రలో భాగంగా ట్రాక్టర్లతో ర్యాలీలు, రోడ్‌ షోలు సహా పలు కార్యక్రమాలు నిర్వహించనున్నారు.ఈ కార్యక్రమంలో పంజాబ్​ ముఖ్యమంత్రి కెప్టెన్​ అమరిందర్​ సింగ్​ సహా పలువురు రాష్ట్రస్థాయి నాయకులు పాల్గొన్నారు.  

Last Updated : Oct 4, 2020, 3:21 PM IST

ABOUT THE AUTHOR

...view details