ఖతార్ ఎయిర్వేస్ క్యూఆర్-830 విమానం కోల్‌కతాలో అత్యవసరంగా ల్యాండ్ అయ్యింది. ఏ సాంకేతిక లోపం వల్లో.. లేదా హైజాక్ లాంటి పెద్ద ముప్పులేవో అనుకుంటే పొరపాటే. దోహా నుంచి బ్యాంకాక్‌కు ప్రయాణిస్తున్న ఓ మహిళ పురిటి నొప్పులే అత్యవసర ల్యాండింగ్‌కు కారణం.
ఈ ఖతార్ విమానంలో ఓ నిండు గర్భిణి ప్రయాణిస్తోంది. థాయ్‌ల్యాండ్‌కు చెందిన ఆమెకు తెల్లవారుజామున పురిటి నొప్పులు మొదలయ్యాయి. అప్రమత్తమైన విమాన సిబ్బంది వైద్యసేవల నిమిత్తం అత్యవసర ల్యాండింగ్ చేయాలని నిర్ణయించారు. దగ్గర్లో ఉన్న కోల్‌కతా విమానాశ్రయాన్ని సంప్రదించారు పైలట్లు.