యావత్ దేశాన్ని కలచివేసిన పుల్వామా ఉగ్రదాడి కేసులో మరో ఇద్దరిని అరెస్ట్ చేసింది జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ). దాడికి ఉపయోగించిన ఐఈడీ బాంబుల కోసం ఈ ఇద్దరిలో ఒకరు ఆన్లైన్ ద్వారా రసాయనాలు కొనుగోలు చేసినట్లు గుర్తించింది.
శ్రీనగర్‌లోని బాగ్ ఎ మెహతబ్ ప్రాంతానికి చెందిన వైజ్ ఉల్ ఇస్లాం (19), పుల్వామా జిల్లాలోని హక్రీపొరా గ్రామానికి చెందిన మహ్మద్ అబ్బాస్ రాథర్ (32)గా గుర్తించారు అధికారులు.
" ఐఈడీలు తయారు చేసేందుకు తన అమెజాన్ ఆన్లైన్ షాపింగ్ అకౌంట్‌ను వినియోగించి బ్యాటరీలు, ఇతర సామగ్రిని కొనుగోలు చేసినట్లు మా ప్రాథమిక విచారణలో ఇస్లాం వెల్లడించాడు. ఇదంతా పాకిస్థానీ ఉగ్రసంస్థ జైషే మహమ్మద్ తీవ్రవాదుల ఆదేశాలతోనే చేసినట్లు ఒప్పకున్నాడు. గతంలో ఉగ్రవాదులకు ఆవాసం కల్పించినట్లు తెలిసింది. "
- ఎన్ఐఏ అధికారి.