తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఆ గ్రామం ప్లాస్టిక్ రహితం.. పర్యావరణ హితం - ఆ గ్రామం ప్లాస్టిక్ రహితం.. పర్యావరణ హితం

పుదుచ్చేరిలోని పిల్లైయార్​కుప్పం అది. గ్రామ కౌన్సిలర్లు, పుదుచ్చేరి పర్యావరణ శాఖ అధికారులు కలిసి ప్లాస్టిక్​రహిత గ్రామ నిర్మాణానికి ఏళ్ల కిందట ఓ బృందంగా ఏర్పడ్డారు. ఒకసారి వాడిపారేసే ప్లాస్టిక్​ను తరిమికొట్టేందుకు వస్త్రం, కాగితంతో తయారుచేసిన సంచులను వినియోగించడం ప్రారంభించారు. 2010లోనే ప్లాస్టిక్ రహితంగా గుర్తింపు పొందిన ఈ గ్రామం ప్రస్తుతం పర్యటక స్థలంగాను కీర్తి గడించింది.

plastic
ఆ గ్రామం ప్లాస్టిక్ రహితం.. పర్యావరణ హితం

By

Published : Jan 15, 2020, 7:32 AM IST

ఆ గ్రామం ప్లాస్టిక్ రహితం.. పర్యావరణ హితం

పరిశుభ్రతతో కూడిన పర్యావరణాన్ని సృష్టించేందుకు నడుం బిగించింది ఆ గ్రామం. ఒకసారి వాడిపారేసే ప్లాస్టిక్ నియంత్రణ దిశగా చక్కటి విధానాన్ని అవలంబిస్తోంది.

పుదుచ్చేరిలోని పిల్లైయార్​కుప్పం గ్రామస్థులు ఒకసారి వాడిపారేసే ప్లాస్టిక్​పై సమష్టి యుద్ధం ప్రకటించారు. గ్రామ కౌన్సిలర్లు, పుదుచ్చేరి పర్యావరణ విభాగంతో కలిసి ఓ బృందంగా ఏర్పడి ప్లాస్టిక్​ నియంత్రణకు కృషి చేస్తున్నారు.

వాడిపారేసే ప్లాస్టిక్​కు చెక్​ పెట్టే దిశగా వస్త్రం, కాగితంతో చేసిన సంచుల తయారీలో ఈ బృంద సభ్యులు శిక్షణ పొందారు.

ఈ బృందం తయారుచేసిన బ్యాగులను స్థానిక షాపులు, కిరణా దుకాణాల వారికి అందిస్తున్నారు. వీరు చేస్తోన్న కృషి ప్రజల మన్ననలు అందుకుంటోంది.

"పిల్లైయార్​కుప్పం ప్లాస్టిక్​ రహిత గ్రామంగా 2010లోనే గుర్తింపు పొందింది. పాలిథిన్ సంచులకు బదులుగా వస్త్ర, కాగితం బ్యాగులను వాడాలని మేం ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాం. దుకాణాల్లో ఈ బ్యాగులను అందిస్తున్నాం. వాడిపారేసే బ్యాగులకు ప్రత్యామ్నాయంగా ఉపయోగిస్తోన్న వీటి తయారీ కోసం స్థానిక మహిళలు, యువతకు సరైన రీతిలో శిక్షణ అందించాం. ప్రస్తుతం ఈ గ్రామంలో ప్లాస్టిక్ సంచుల వినియోగం లేదు."

-సురేశ్, పర్యావరణ ఇంజినీరు, పుదుచ్చేరి

ఈ పిల్లైయార్​కుప్పం గ్రామస్థుల కృషి వారి పరిసరాలను ప్లాస్టిక్ రహితం చేయడం మాత్రమే కాదు. గ్రామాన్ని ఓ పర్యటక ప్రదేశం గానూ మార్చింది.

ఇదీ చూడండి: ప్రభుత్వ, కార్పొరేట్​ సంస్థల్లో ఇక 'యోగా- బ్రేక్'​

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details