తెలంగాణ

telangana

By

Published : Sep 3, 2019, 5:36 PM IST

Updated : Sep 29, 2019, 7:41 AM IST

ETV Bharat / bharat

రష్యా పర్యటనకు మోదీ.. సంబంధాల బలోపేతమే లక్ష్యం

భారత్​ రష్యా  ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలపడాలని ప్రధాని మోదీ ఆకాంక్షించారు. తూర్పుదేశాల ఆర్థిక సమాఖ్య సదస్సుకు హాజరయ్యేందుకు వ్లాదివోస్టాక్ పర్యటనకు వెళ్లేముందు రష్యా సంబంధాలపై స్పందించారు మోదీ.

రష్యా పర్యటనకు మోదీ.. సంబంధాల బలోపేతమే లక్ష్యం


తూర్పు ఆర్థిక సదస్సులో పాల్గొనడానికి రెండు రోజుల పర్యటన నిమిత్తం వ్లాదివోస్టాక్​ వెళ్లారు ప్రధాని నరేంద్ర మోదీ. ఈ సందర్భంగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో ప్రాంతీయ, అంతర్జాతీయ సమస్యలపై చర్చించడానికి ఎదురుచూస్తున్నట్లు ఆయన వ్యాఖ్యానించారు.

"మా ద్వైపాక్షిక భాగస్వామ్యం, ప్రాంతీయ, అంతర్జాతీయ పరస్పర సమస్యల గురించి నా స్నేహితుడు, రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో చర్చించడానికి నేను ఎదురుచూస్తున్నాను. ఈస్ట్రన్ ఎకనామిక్ ఫోరమ్​కు హాజరయ్యే ఇతర ప్రపంచ నాయకులనూ కలిసి, భారత పారిశ్రామిక వేత్తలు, వ్యాపార ప్రతినిధులతో సంభాషించడానికి నేను ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను.
రక్షణ, పౌర అణుశక్తి రంగాలతోపాటు అంతరిక్షాన్ని శాంతియుతంగా వినియోగించుకోవటంపై పరస్పర సహకారానికి ఇరు దేశాలు(రష్యా, భారత్​) ఆసక్తిగా ఉన్నాయి. మా మధ్య వాణిజ్య పెట్టుబడి సంబంధాలు బలపడుతున్నాయి. ఇక ముందు మా దృఢమైన ద్వైపాక్షిక సంబంధాలకు ప్రంపంచ దేశాల నుంచి ప్రశంసలు అందుతాయి."

-ప్రధాని మోదీ

మోదీ చేసిన ఈ ప్రకటన ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అధ్యక్షుడు పుతిన్ ఆహ్వానం మేరకువ్లాదివోస్టాక్‌లో 5వ తూర్పు ఆర్థిక సదస్సులో మోదీ ముఖ్య అతిథిగా పాల్గొంటారు. పుతిన్‌తో కలిసి 20 వ భారత్​-రష్యా వార్షిక సదస్సును కూడా నిర్వహించనున్నారు మోదీ.

ఇదీ చూడండి:ఆసుపత్రిలో బొమ్మలు.. పిల్లల ఏడుపులకు సెలవులు!

Last Updated : Sep 29, 2019, 7:41 AM IST

ABOUT THE AUTHOR

...view details