తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఆప్టికల్ ఫైబర్ కేబుల్ వ్యవస్థకు మోదీ శ్రీకారం - అండమాన్​కు ఇక మెరుగైన సమాచారం- ఓఎఫ్​సీ ప్రారంభం

అండమాన్ ద్వీప సమూహానికి మెరుగైన కనెక్టివిటీ కల్పించే ఆప్టికల్ ఫైబర్ కేబుల్​ వ్యవస్థను ప్రధాని మోదీ ప్రారంభించారు. ఈ ప్రాజెక్టులో భాగంగా చెన్నై నుంచి పోర్ట్​ బ్లెయిర్​ సహా మరో ఏడు ద్వీపాలకు సమాచార వ్యవస్థను ఏర్పాటు చేశారు.

Prime Minister Narendra Modi inaugurates the submarine Optical Fibre Cable (OFC) connecting Chennai and Port Blair
ఆప్టికల్ ఫైబర్ కేబుల్ వ్యవస్థను ఆవిష్కరించిన ప్రధాని

By

Published : Aug 10, 2020, 11:03 AM IST

చెన్నై నుంచి పోర్ట్​ బ్లెయిర్​ను అనుసంధానించే సముద్రగర్భ ఆప్టికల్ ఫైబర్ కేబుల్(ఓఎఫ్​సీ)​ వ్యవస్థను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కార్యక్రమంలో పాల్గొన్నారు మోదీ. రిమోట్​ ద్వారా ప్రాజెక్టును ఆవిష్కరించారు.

ఈ ప్రాజెక్టులో భాగంగా చెన్నై నుంచి పోర్ట్​ బ్లెయిర్​ సహా మరో ఏడు ద్వీపాలకు సమాచార వ్యవస్థను ఏర్పాటు చేశారు. 2018 డిసెంబర్ 30న ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు మోదీ. ఇందులో భాగంగా తీరంలో ఉన్న ద్వీపాలకు టెలికమ్యునికేషన్ సిగ్నళ్లు పంపించే విధంగా సముద్రగర్భంలో సబ్​మెరైన్ కేబుళ్లను ఏర్పాటు చేశారు.

అంతకుముందు... కేబుల్ వ్యవస్థ ప్రారంభోత్సవాన్ని ఉద్దేశించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు. అండమాన్ ప్రజలకు ఈ ఆగస్టు 10 చాలా ప్రత్యేకమైన రోజు అని పేర్కొన్నారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details