సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ఈ నెల 11నుంచి ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఎగ్జిట్ పోల్స్ ప్రసారాలపై నిషేధం విధించింది కేంద్ర ఎన్నికల సంఘం. నిషేధం ఉన్న సమయంలో జ్యోతిషం, పేకముక్కల ద్వారా జోస్యం వంటి ఏ విధమైన పద్ధతిలోనైనా ముందస్తు ఫలితాలు ప్రసారం చేస్తే ఎన్నికల నియమావళి ఉల్లంఘన అవుతుందని స్పష్టం చేసింది.
ఎన్నికల వేళ ఎగ్జిట్ పోల్స్ ప్రసారాలపై నిషేధం - media
ఎన్నికలు జరిగే సమయంలో ఎగ్జిట్ పోల్స్‌పై ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో ప్రసారాలపై నిషేధం విధించింది ఎన్నికల సంఘం. నిషేధ సమయంలో రాజకీయ విశ్లేషకులు, జ్యోతిషులు, పేకముక్కలతో జోస్యం వంటి ఏ విధమైన పద్ధతుల్లో ప్రసారం చేసినా ఎన్నికల నియమావళి ఉల్లంఘన అవుతుందని స్పష్టం చేసింది.
ఎగ్జిట్ పోల్స్‌పై నిషేధం
మే 19 సాయంత్రం వరకు ఎలక్ట్రానిక్, ప్రింట్ మీడియాకు ఈ నిబంధనలు వర్తిస్తాయని చెప్పింది ఈసీ.
మొదటి దశ ఎన్నికలు జరుగుతున్న ప్రాంతాల్లో ప్రచారం ఈ సాయంత్రం ముగియనుంది.
Last Updated : Apr 9, 2019, 8:16 AM IST