తెలంగాణ

telangana

By

Published : Dec 14, 2019, 1:10 PM IST

Updated : Dec 14, 2019, 7:24 PM IST

ETV Bharat / bharat

ప్రశాంత్​ కిశోర్​ 'ఆపరేషన్​ దిల్లీ'- ఆప్​ విజయమే లక్ష్యం!

దిల్లీలో అధికారం నిలబెట్టుకునే లక్ష్యంతో కసరత్తు ముమ్మరం చేసింది ఆమ్​ఆద్మీ పార్టీ. 2020 శాసనసభ ఎన్నికలకు అవసరమైన వ్యూహ రచన కోసం ప్రశాంత్​ కిశోర్ నేతృత్వంలోని ఐ-ప్యాక్​తో జట్టుకట్టింది.

Prashant Kishor's I-PAC teams up with AAP ahead of Delhi polls
ప్రశాంత్​ కిశోర్​ 'ఆపరేషన్​ దిల్లీ'- ఆప్​ విజయమే లక్ష్యం!

ప్రశాంత్​ కిశోర్​ 'ఆపరేషన్​ దిల్లీ'- ఆప్​ విజయమే లక్ష్యం!

ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్​ కిశోర్​... దిల్లీ శాసనసభ ఎన్నికల్లో ఆమ్​ఆద్మీ పార్టీ విజయమే లక్ష్యంగా పనిచేయనున్నారు. ప్రశాంత్​ నేతృత్వంలోని రాజకీయ సలహాదారు సంస్థ ఐ-ప్యాక్(ఇండియన్ పొలిటికల్ యాక్షన్​ కమిటీ)​... తమ పార్టీకి సేవలు అందించనున్నట్లు ఆప్​ సమన్వయకర్త, దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు.

పీకే బృందంతో కలిసి పనిచేయడం కేజ్రీవాల్ ట్వీట్​కు ఐ-ప్యాక్ రిప్లై ఇచ్చింది. పంజాబ్​లో తాము కాంగ్రెస్​ కోసం పనిచేసిన సమయంలో ఆప్​ను బలమైన ప్రత్యర్థి అని గుర్తించినట్లు వెల్లడించింది. ఇప్పుడు ఆప్​తో జట్టు కట్టడం ఆనందంగా ఉందని ట్వీట్ చేసింది.

70 స్థానాలున్న దిల్లీ శాసనసభకు వచ్చే ఏడాది ఆరంభంలో ఎన్నికలు జరగనున్నాయి.

2014 నుంచి.....

స్థానిక పరిస్థితులకు తగినట్లు రాజకీయ పార్టీలకు ఎన్నికల వ్యూహాలు రచించే సంస్థగా ఐ-ప్యాక్​కు మంచి పేరుంది. 2014 సార్వత్రిక ఎన్నికల్లో నరేంద్రమోదీ ప్రచార ప్రణాళికను ఈ సంస్థే రూపొందించింది. 2015లో బిహార్​లో నీతీశ్​ కుమార్​, 2019లో ఆంధ్రప్రదేశ్​లో జగన్​ ముఖ్యమంత్రి కావడంలో ప్రముఖ పాత్ర పోషించింది.
2021లో జరిగే బంగాల్‌ శాసనసభ ఎన్నికల్లో తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ విజయం కోసం ఐ-ప్యాక్​ పనిచేస్తోంది.

ఇదీ చూడండి:బంగాల్​లో ఆరని 'పౌర' సెగలు.. నిరసనలు ఉద్ధృతం

Last Updated : Dec 14, 2019, 7:24 PM IST

ABOUT THE AUTHOR

...view details