రెండోసారి ప్రధానమంత్రి బాధ్యతలు చేపట్టిన అనంతరం నరేంద్ర మోదీ తొలి విదేశీ పర్యటన తేదీ ఖరారైంది. ఈ మేరకు విదేశాంగ శాఖ ప్రకటించింది. ఈ నెల 8,9 తేదీల్లో మాల్దీవులు, శ్రీలంకలో మోదీ పర్యటిస్తారని వెల్లడించింది. పొరుగు దేశాలకు భారతదేశం ఇచ్చే ప్రాధాన్యతను ఈ పర్యటనలు ప్రతిబింబిస్తాయని స్పష్టం చేసింది విదేశాంగ శాఖ.
"అధ్యక్షుల ఆహ్వానం మేరకు మాల్దీవులు, శ్రీలంకలో ప్రధాని మోదీ పర్యటిస్తారు. ఈ పర్యటనలు ఆ దేశాలతో ద్వైపాక్షిక సంబంధాల అభివృద్ధిని సమీక్షించడానికి ఉపయోగపడతాయి."
--- విదేశాంగ శాఖ.