తెలంగాణ

telangana

ETV Bharat / bharat

నేడు పార్లమెంటు​ సభ్యులకు ప్రధాని విందు - members

లోక్‌సభ, రాజ్యసభ సభ్యులకు నేడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విందు ఇవ్వనున్నారు. దేశ రాజధాని దిల్లీలోని హోటల్​ అశోకలో విందు ఏర్పాట్లు చేపట్టినట్లు అధికార వర్గాలు పేర్కొన్నాయి.  ఇప్పటికే ఎంపీలందరికి ఆహ్వానం పంపారు పార్లమెంటు​ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్​ జోషీ.

నేడు పార్లమెంటు​ సభ్యులకు ప్రధాని విందు

By

Published : Jun 20, 2019, 5:40 AM IST

నేడు పార్లమెంటు​ సభ్యులకు ప్రధాని విందు

ప్రధానిగా రెండోసారి అధికారం చేపట్టిన అనంతరం తొలిసారి లోక్​సభ, రాజ్యసభ సభ్యులతో భేటీ కానున్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. నేడు పార్లమెంట్​ సభ్యులందరికీ విందు ఇవ్వనున్నారు.

దిల్లీలోని హోటల్​ అశోకలో విందు ఏర్పాట్లు చేపట్టినట్లు అధికార వర్గాలు పేర్కొన్నాయి. ఇప్పటికే ఎంపీలందరికీ పార్లమెంట్ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్​ జోషీ ఆహ్వానం పంపించినట్లు తెలిపారు.

జమిలి ఎన్నికల నిర్వహణ కోసం అఖిల పక్షాలతో బుధవారం భేటీ అయ్యారు మోదీ. ఇదే సమావేశంలో పలు అంశాలపై చర్చించారు.

ఇదీ చూడండి:'కమిటీ ద్వారా ముందుకు' - జమిలిపై కేంద్రం

ABOUT THE AUTHOR

...view details