తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కోట్ల విలువైన 50 ప్రాజెక్టులకు మోదీ శ్రీకారం - Modi news

ఉత్తర్​ప్రదేశ్​ వారణాసి పర్యటనలో భాగంగా రూ.1,254 కోట్ల విలువైన 50 ప్రాజెక్టులకు ప్రధాని నరేంద్ర మోదీ శంకుస్థాపన చేశారు. 430 పడకల ప్రభుత్వ సూపర్​ స్పెషాలిటీ ఆసుపత్రిని ప్రారంభించారు. వీడియో కాన్ఫరెన్స్​ ద్వారా దేశంలో మూడో ప్రైవేటు రైలును ప్రారంభించారు.

PM launches, lays foundation of 50 projects worth Rs.1,254 cr
వారణాసిలో కోట్ల విలువైన 50 ప్రాజెక్టులకు శ్రీకారం

By

Published : Feb 16, 2020, 4:11 PM IST

Updated : Mar 1, 2020, 12:57 PM IST

వారణాసిలో రూ.1,254 కోట్ల విలువైన 50 ప్రాజెక్టులకు మోదీ శ్రీకారం

ఉత్తర్​ప్రదేశ్​లోని తన సొంత నియోజకవర్గం వారణాసిలో రూ.1,254 కోట్ల విలువైన 50 ప్రాజెక్టులకు ఆదివారం శంకుస్థాపన చేశారు ప్రధాని నరేంద్ర మోదీ. 430 పడకల సూపర్​ స్పెషాలిటీ ప్రభుత్వ ఆసుపత్రిని ప్రారంభించారు. జన్​ సంఘ్​ మాజీ నేత(​ఆర్​ఎస్​ఎస్) దీన్​దయాళ్​ ఉపాధ్యాయ 63 అడుగుల ఎత్తైన విగ్రహాన్ని ఆవిష్కరించారు ప్రధాని.

మూడో ప్రైవేటు రైలు

ఉత్తర్​ప్రదేశ్ - మధ్యప్రదేశ్ మధ్య 3 ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రాలను కలుపుతూ రాత్రి పూట నడిచే మహాకాళ్ ఎక్స్​ప్రెస్ తొలి రైలును వీడియో కాన్ఫరెన్స్​ ద్వారా మోదీ ప్రారంభించారు.

19 భాషల్లో మొబైల్​ యాప్​

ఇవాళ ఉదయం వారణాసిలో జరిగిన శ్రీ జగద్గురు విశ్వ ఆరాధ్య గురుకుల్​ శతాబ్ది వేడుకల్లో పాల్గొన్నారు ప్రధాని. శ్రీ సిద్ధాంత్​ శిఖామణి గ్రంథ్​ అనువదించిన సంస్కరణను మొబైల్​ యాప్​​ ద్వారా 19 భాషల్లో విడుదల చేశారు మోదీ.

ఉత్తర్​ప్రదేశ్​ గవర్నర్​ ఆనందీబెన్​ పటేల్​, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్​, కర్ణాటక సీఎం యడియూరప్ప తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఇదీ చదవండి:లైవ్​ వీడియో : కానిస్టేబుల్​ చాకచక్యంతో మహిళ ప్రాణం సేఫ్​

Last Updated : Mar 1, 2020, 12:57 PM IST

ABOUT THE AUTHOR

...view details