మోదీ అధ్యక్షతన రెండు కేబినెట్ కమిటీలు ఉద్యోగాల కల్పన, పెట్టుబడుల్లో పురోగతి సాధించడంపై నరేంద్ర మోదీ సర్కారు ప్రత్యేక దృష్టి సారించింది. మోదీ హయాంలో దేశంలో నిరుద్యోగం తారస్థాయికి చేరిందంటూ విపక్షాలు దుమ్మెత్తిపోస్తున్న వేళ.. ఈ కీలక అంశాల బాధ్యతలు చూసుకునేందుకు రెండు కేబినెట్ కమిటీలను కేంద్రం నియమించింది.
పెట్టుబడులు, వృద్ధిరేటు పురోగతిపై ఏర్పాటు చేసిన కమిటీలో కేంద్ర మంత్రులు అమిత్‌షా, నిర్మలా సీతారామన్, నితిన్ గడ్కరీ, పీయూష్ గోయల్ సభ్యులుగా ఉన్నారు.
ఉద్యోగ కల్పన కోసం నియమించిన కేబినెట్ కమిటీలో అమిత్‌షా, నిర్మలా సీతారామన్, పీయుష్ గోయల్‌తో పాటు కేంద్రమంత్రులు నరేంద్రసింగ్ తోమర్., రమేష్ పోక్రియాల్, ధర్మేంద్ర ప్రదాన్, ఎమ్ఎన్ పాండే, సంతోష్ కుమార్ గంగ్వార్, హార్దిప్ పూరి సభ్యులుగా ఉన్నారు.
ఈ రెండు కమిటీలూ ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో పనిచేయనున్నాయి. పట్టణ ప్రాంతాల్లో 7.8 శాతం నిరుద్యోగం ఉండగా.. గ్రామాల్లో నిరుద్యోగ యువత 5.3 శాతం ఉన్నట్లు కేంద్ర కార్మికశాఖ ఇటీవల విడుదల చేసిన నివేదికలో స్పష్టం చేసింది