తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఉద్యోగానికి ఎసరు తెచ్చిన ఐపీఎల్​ పాస్​

ఐపీఎల్​ పాసులకు ఆశపడ్డ ఓ కేంద్ర ప్రభుత్వ సీనియర్​ అధికారి పదవిని కోల్పోయారు. పునరుత్పాదక ఇంధన వనరుల మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శిని అర్ధంతరంగా రైల్వే శాఖకు తిరిగి పంపింది కేబినెట్​ నియామకాల కమిటీ.

ఐపీఎల్ పాసులు

By

Published : May 11, 2019, 5:12 PM IST

ఐపీఎల్​ పాసులు ఓ ప్రభుత్వ అధికారి ఉద్యోగానికి ఎసరు పెట్టాయి. ఇటీవల జరిగిన ఓ మ్యాచ్​కు కాంప్లిమెంటరీ పాసులు ఇవ్వాలని దిల్లీ జిల్లా క్రికెట్​ సంఘాన్ని (డీడీసీఏ) అభ్యర్థించటమే ఆయన చేసిన తప్పు. ఈ విషయం బయటకు రాగానే చర్యలు చేపట్టింది ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలోని కేబినెట్ నియామకాల కమిటీ (ఏసీసీ).

1987 బ్యాచ్​ ఇండియన్ రైల్వే సర్వీస్​ అధికారి గోపాల్​ కృష్ణ గుప్తా.. డిప్యుటేషన్​పై పునరుత్పాదక వనరుల మంత్రిత్వ కార్యదర్శిగా నియమితులయ్యారు. మార్చ్​లో జరిగిన ఓ మ్యాచ్​కు కాంప్లిమెంటరీ పాసులు కావాలని డీడీసీఏ కార్యాలయాన్ని కోరారు. అయితే సరైన స్పందన రాలేదు.

డీడీసీఏ అధ్యక్షుడు రజత్​ శర్మకు పరిస్థితిని వివరిస్తూ లేఖ రాశారు గోపాల్​ కృష్ణ. ఇద్దరమూ సమాన స్థాయి అధికారులమనీ, పరస్పరం సహాయ సహకారాలు ఉండాలని ఆ లేఖలో సూచించారు గుప్తా. ఈ విషయం మీ కింది ఉద్యోగులకు అర్థమయ్యేలా చెప్పడంటూ హితవు పలికారు. ఈ లేఖ బయటకు లీకవగా... గుప్తాపై చర్యలు తీసుకుంది కేబినెట్​ కమిటీ. డిప్యుటేషన్​ గడువు ముగియకముందే సంయుక్త కార్యదర్శి హోదా నుంచి తొలగించి తిరిగి సొంత క్యాడర్​ అయిన రైల్వేస్​కు పంపింది.

ఇదీ చూడండి: తమిళనాడు నుంచి జపాన్​కు 'నీటి' ఇంజిన్

ABOUT THE AUTHOR

...view details