తెలంగాణ

telangana

By

Published : Jan 28, 2020, 7:33 AM IST

Updated : Feb 28, 2020, 5:43 AM IST

ETV Bharat / bharat

ప్లాస్టిక్​ సీసాలతో అంగన్​వాడీ కేంద్రాల నిర్మాణం

ప్లాస్టిక్​పై పోరుకు ప్రపంచమంతా క్రమంగా ఏకమవుతోంది. ఒకసారి వాడిపారేసే ప్లాస్టిక్​ వ్యర్థాలను మంచి కోసం వినియోగించాలని సంకల్పించారు అసోంలోని మజౌలి జిల్లా వాసులు.  ఈ వ్యర్థాలతో అంగన్​వాడీ కేంద్రాలను నిర్మించేందుకు నడుం కట్టారు.

plastic
ప్లాస్టిక్​ సీసాలతో అంగన్​వాడీ కేంద్రాల నిర్మాణం

ప్లాస్టిక్​ సీసాలతో అంగన్​వాడీ కేంద్రాల నిర్మాణం

ప్లాస్టిక్ వ్యర్థాలను మంచికోసం ఉపయోగించేందుకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రయత్నాలు సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో అసోం మజౌలీ జిల్లాలో ఒకసారి వాడిపారేసే ప్లాస్టిక్​ను సమాజ శ్రేయస్సు కోసం వినియోగిస్తున్నారు. అంగన్​వాడీ కేంద్రాలు, బాలల సంరక్షణ కేంద్రాల నిర్మాణం కోసం ఉపయోగిస్తున్నారు.

మజౌలీ డిప్యూటీ కమిషనర్ విక్రం కైరి ప్లాస్టిక్ వ్యర్థాల నియంత్రణకు కిషాలయ అనే కార్యక్రమాన్ని రూపొందించారు. ఇందులో భాగంగా 100 అంగన్​వాడీ కేంద్రాలను ఒకసారి వాడిపారేసే ప్లాస్టిక్​తో నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

"ఇది అసోంలో మొట్టమొదటి ప్లాస్టిక్ నిర్మాణ కార్యక్రమం. అయితే ఇంతకుముందు మేం మార్గరిటాలో ఇదే విధానాన్ని ఉపయోగించి ఓ షెడ్డు నిర్మించాం. అది ఇప్పటికీ ఉపయోగంలో ఉంది. ఈ విధానంతో ఇప్పటికే ఫిలిప్పీన్స్, ఆఫ్రికా, దక్షిణ అమెరికా ఖండాల్లో నిర్మాణాలు చేపట్టారు. భారత్​లో కర్ణాటక సహా దక్షిణ భారత రాష్ట్రాలు ఈ ప్లాస్టిక్ వ్యర్థాల నిర్మాణాలను చేపడుతున్నాయి. ఇదే ప్రయోగాన్ని అసోంలోనూ చేయాలని భావించాం. ఈ నేపథ్యంలోనే మజౌలీలోని అంగన్​వాడీ కేంద్రాల్లో ఈ నిర్మాణాలు చేపట్టాం. దీనికోసం 20వేల ప్లాస్టిక్ బాటిళ్లను వినియోగిస్తున్నాం."

-విక్రమ్ కైరి, మజౌలీ డిప్యూటీ కమిషనర్

ఈ కార్యక్రమానికి అసోంలోని ప్రపంచంలోనే అతిపెద్దదైన బ్రహ్మపుత్ర నది దీవి వేదికైంది. సిలకల గావ్ గ్రామపంచాయతీ పరిధి కకోరికోటా పబనాలో రూ. 80వేల ఖర్చుతో మొట్టమొదటి ప్లాస్టిక్ వ్యర్థాల అంగన్​వాడీ కేంద్రాన్ని నిర్మిస్తున్నారు. దీనికి 2019 డిసెంబర్ 25న పునాది వేశారు.

ఈ కిషాలయ పథకంలో భాగంగా తొలి విడతలో 45 అంగన్​వాడీ కేంద్రాలను నిర్మిస్తున్నారు. ఇప్పటికే 4 కేంద్రాలు వివిధ దశల్లో నిర్మాణంలో ఉన్నాయి. ఈ కార్యక్రమంలో స్థానికులంతా భాగస్వాములవుతున్నారు.

"ప్లాస్టిక్ వ్యర్థాలను బయటపారేసే దానికి బదులుగా వాటిని సేకరించి మంచికోసం ఉపయోగించాలి. ఇది కాలుష్యాన్ని తగ్గించడమే కాదు.. ఏదైనా నిర్మించేందుకు ఉపయోగపడుతుంది."

-స్థానికుడు

ఈ నిర్మాణాలు చేపట్టేందుకు లక్షల బాటిళ్లు అవసరమని అంచనా. ఇందుకోసం బాటిళ్ల సేకరణ లక్ష్యంగా పెట్టుకున్నారు. పశ్చిమ కకోరికోటాలోని ఇందిరా మహిళల సామాజిక సంస్థ బాటిళ్లను అందజేస్తున్నారు. ఈ కార్యక్రమానికి మహిళా స్వయం సహాయక బృందాలు ఆర్థికంగా సహాయం చేస్తున్నాయి.

ఇదీ చూడండి: చెక్కతో చేసిన టూత్​ బ్రష్​, కాగితపు స్ట్రాలు చూశారా?

Last Updated : Feb 28, 2020, 5:43 AM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details