సరిహద్దు వెంబడి పాకిస్థాన్ సైన్యం పదేపదే కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడుస్తోంది. తాజాగా జమ్ముకశ్మీర్ పూంచ్ సెక్టార్లో వరుసగా రెండోరోజు నియంత్రణ రేఖకు సమీపంలో ఉన్న సరిహద్దు ప్రాంతాలపై మోర్టారు బాంబులతో దాడికి తెగించింది. ఈ ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు వెల్లడించారు. మధ్యాహ్నం 12.50 గంటల సమయంలో బాలాకోట్, మేంధార్ సెక్టార్లలో పాక్ సైన్యం కాల్పులకు తెగబడినట్లు పేర్కొన్నారు.
శనివారమే కాల్పులు