తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'అంతా అబద్ధం- క్లస్టర్​ బాంబులు వాడలేదు'

నియంత్రణ రేఖ వెంబడి నివసిస్తోన్న పౌరులే లక్ష్యంగా భారత సైన్యం క్లస్టర్​ బాంబులతో దాడికి తెగబడుతోందన్న పాక్​ ఆరోపణలను భారత్​ ఖండించింది. పాక్​ చెప్పేవన్నీ అబద్ధాలు, మోసపూరితమని పేర్కొంది. భారత్​ అమాయక పౌరులే లక్ష్యంగా క్లస్టర్​ మందుగుండును ప్రయోగిస్తోందని పాక్​ విదేశాంగ మంత్రి ట్విట్టర్​లో ఆరోపించారు.

'అంతా అబద్ధం- క్లస్టర్​ బాంబులు వాడలేదు'

By

Published : Aug 4, 2019, 9:50 AM IST

భారత్​పై దాయాది పాకిస్థాన్​ మరోసారి బురద జల్లే ప్రయత్నం చేసింది. నియంత్రణ రేఖ వెంబడి నివసిస్తోన్న పౌరులే లక్ష్యంగా భారత సైన్యం క్లస్టర్​ బాంబులతో దాడికి తెగబడుతోందని ఆరోపించింది. ఈ​ ఆరోపణలను భారత్​ ఖండించింది. కేవలం ప్రచారం కోసం పాక్​ అసత్యాలు చెబుతోందని పేర్కొంది.

భారత సైన్యం నియంత్రణ రేఖ వెంబడి పౌరులపై క్లస్టర్​ బాంబుల్ని ఉపయోగిస్తుందంటూ పాకిస్థాన్​ విదేశాంగ మంత్రి షా మహమూద్​ ఖురేషి తన ట్విట్టర్​లో ఆరోపించారు. పేలుడుకు సంబంధించిన క్షతగాత్రుల చిత్రాలను పోస్ట్​ చేశారు. ఇది జెనీవా ఒప్పందం, అంతర్జాతీయ మానవత్వ చట్టాలకు ఉల్లంఘించడమేనని పాక్ సైనిక అధికార ప్రతినిధి ఆసిఫ్​ గఫూర్​ ఆరోపించారు.

భారత సైన్యం జులై 30న నీలం లోయలో పౌరులను లక్ష్యంగా చేసుకొని జరిపిన కాల్పుల్లో ఇద్దరు పౌరులు మరణించగా, 11 మంది గాయపడ్డారని పేర్కొన్నారు.

ఖండించిన భారత్​...

ఈ ఆరోపణల్ని సైన్యం అదనపు డీజీ ఖండించారు. పాకిస్థాన్​ సైన్యం ఎప్పుడూ చొరబాట్ల ద్వారా ఉగ్రవాదులను పంపించేందుకు ప్రయత్నిస్తుంటుందని, ఆయుధాలతో వారికి సాయం చేస్తుంటుందని ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

భారత్​ ప్రతిస్పందన కేవలం సైనిక లక్ష్యాలు, పాక్​ సైన్యం సాయంతో చొరబడుతున్న ఉగ్రవాదులపైనే ఉంటుందని స్పష్టం చేసింది భారత సైన్యం. పాక్​ మంత్రి పోస్ట్​ చేసిన చిత్రాలు మోర్టారు కాల్పులకు సంబంధించినవని, క్లస్టర్​ బాంబు పేలుళ్లవి కాదని సైనిక వర్గాలు పేర్కొన్నాయి.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details