ఎడతెరిపిలేని వర్షాలకు ముంబయి నగరం జలమయమైంది. ఎక్కడికక్కడ నాలుగేసి అడుగుల లోతు నిలిచిపోయిన నీటితో వీధులన్నీ చెరువులను తలపిస్తున్నాయి. దీంతో సంబంధిత శాఖలు నగరవాసులకు హెచ్చరికలు జారీ చేసి, రెడ్ అలర్ట్ ప్రకటించింది బృహన్ ముంబయి మున్సిపల్ కార్పొరేన్ (బీఎంసీ).
ఎడతెరిపి లేని వర్షాలకు నీటమునిగిన నగరం! ముంబయి నగరంలో సోమవారం ఉదయం 8 గంటలకు మొదలయిన వాన మంగళవారం తెల్లవారుజాము 3 గంటలవరకు దంచికొట్టింది. దాదాపు 140.5 మిమీల వర్షాపాతం నమోదైందని వెల్లడించింది భారత వాతావరణ శాఖ. మంగళవారం, బుధవారాల్లోనూ ఇదే స్థాయిలో వర్షాపాతం నమోదయ్యే అవకాశముందని తెలిపింది. భారీ వర్షాల కారణంగా అలల తరంగాలు సుమారు 4.51 మీటర్ల పెరిగే అవకశాముందని అంచనా వేసింది.
ఎడతెరిపి లేని వర్షాలకు నీటమునిగిన నగరం! దీంతో నగర పాలక సంస్థ అప్రమత్తమైంది. సముద్ర తీర ప్రాంతాలు, లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలకు హెచ్చరికలు జారీ చేసింది. వర్షాల కారణంగా మీథి నదీ నీటి మట్టం పెరిగి, ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాల్సికవస్తే పాఠశాల భవనాలను రక్షిత కేంద్రాలుగా సిద్ధం చేయాలని విద్యా శాఖకు ఆదేశాలు జారీ చేసింది. సహాయ దళాలు, భద్రతా బలగాలతో పాటు విద్యుత్, రవాణా సంస్థలను జాగృతపరిచింది.
ఇప్పటికే, వీధుల్లో నిలిచిపోయిన నీటిని తోడేసేందుకు 299 తాత్కాలిక పంపింగ్ మెషిన్లు సిద్ధం చేసింది బీఎంసీ. రానున్న 48 గంటల్లో ముంబయి సహా ఠాణే, రాయిగఢ్, రత్నగిరి సహా పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాముందని హెచ్చరింది వాతావరణ శాఖ.
ఇదీ చదవండి: చితికిన దేశ ఆరోగ్యానికి ఇక చికిత్స కావాలి!