వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు దేశవ్యాప్తంగా లాక్డౌన్ అమల్లో ఉన్నా.. అక్కడక్కడా ప్రజలు బయట తిరుగుతూనే ఉన్నారు. కరోనా కేసులు, మరణాలు అత్యధికంగా నమోదైన మహారాష్ట్రలో పరిస్థితి మరీ దారుణం. ఆ రాష్ట్రంలో ఇప్పటివరకు లక్షకుపైగా లాక్డౌన్ నిబంధనల్ని ఉల్లంఘించిన కేసులు నమోదవ్వగా.. 19,297 మందిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.
నిబంధనల్ని ఉల్లంఘించిన సుమారు లక్షా 2 వేల మందిపై సెక్షన్-188 కింద కేసులు నమోదుచేసినట్లు తెలిపారు అధికారులు.
సిబ్బందిపై దాడి...