పౌరసత్వ చట్టంపై ప్రతిపక్షాలు అనవసరంగా రాద్ధాంతం చేస్తూ అసత్యాన్ని ప్రచారం చేస్తున్నాయని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆరోపించారు. ఏ ఇతర విషయాలు లేకపోవటం వల్ల సీఏఏపై ప్రతిక్షాలు గగ్గోలు పెడుతున్నాయని మండిపడ్డారు.
గుజరాత్ పోలీసులకు సంబంధించిన వివిధ ప్రాజెక్టుల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు షా.
"ప్రతిపక్షాలు.. రాహుల్ బాబా కంపెనీ, మమత బెనర్జీ, కేజ్రీవాల్ కమ్యూనిస్టులు అందరూ సీఏఏపై అసత్య ప్రచారం చేస్తున్నారు. కోట్లాది మంది భాజపా కార్యకర్తలారా ఇంటింటికీ వెళ్లి ప్రజలకు సత్యాన్ని చేరవెయ్యండి. సీఏఏను ప్రజల్లోకి తీసుకెళ్లండి."