తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ముస్లింలకు భారత్​ రక్షణ కల్పించాలి: ఓఐసీ - latest citizen amendment act news

పౌరసత్వ చట్ట సవరణ, అయోధ్య తీర్పు అనంతరం భారత్​లో చోటుచేసుకుంటోన్న పరిణామాలను నిశితంగా పరిశీలిస్తున్నట్లు  'ఆర్గనైజేషన్​ ఆఫ్​ ఇస్లామిక్​ కోఆపరేషన్​' పేర్కొంది. ముస్లింలకు, వారి మత కేంద్రాలకు రక్షణ కల్పించాలని భారత ప్రభుత్వాన్ని కోరింది. లేదంటే ఉద్రిక్తతలు తలెత్తే అవకాశం ఉందని అభిప్రాయపడింది.

oic
పౌరసత్వ

By

Published : Dec 23, 2019, 5:26 AM IST

Updated : Dec 23, 2019, 7:21 AM IST

భారత్​లో తాజా పరిణామాల నేపథ్యంలో ముస్లింల పరిస్థితిపై ఆర్గనైజేషన్​ ఆఫ్​ ఇస్లామిక్ కోఆపరేషన్​ ఆందోళన వ్యక్తం చేసింది. అయోధ్య తీర్పు, పౌరసత్వ చట్ట సవరణ అనంతరం భారత్​లో జరుగుతున్న పరిణామాలను నిశితంగా పరిశీలిస్తున్నట్లు ఓఐసీ పేర్కొంది. ముస్లింలకు, వారి మత కేంద్రాలకు రక్షణ కల్పించాలని భారత ప్రభుత్వాన్ని కోరింది.

ముస్లిం మైనారిటీలకు భారత్​ రక్షణ కల్పించాలి: ఓఐసీ

"భారత్​లో మైనారిటీలైన ముస్లింలను ప్రభావితం చేస్తున్న ఇటీవలి పరిణామాలను ఇస్లామిక్ కోఆపరేషన్​ జనరల్ సెక్రటేరియట్ నిశితంగా పరిశీలిస్తోంది."

- ఓఐసీ సంక్షిప్త ప్రకటన

పాక్​కు అండగా..

ముస్లిం మెజారిటీ ఉన్న 57 సభ్య దేశాల కూటమి ఓఐసీ. సాధారణంగా ఇది పాకిస్థాన్​కు అండగా నిలుస్తుంటుంది.

ఉద్రిక్తతలు చెలరేగవచ్చు..

ఐక్యరాజ్యసమితి నిబంధనలు, అంతర్జాతీయ ఒప్పందాలను అనుసరించి మైనారిటీలపై ఎలాంటి వివక్ష చూపించకుండా, వారి హక్కులు పరిరక్షించాలని ఓఐసీ పేర్కొంది. ఈ సూత్రాలకు వ్యతిరేకంగా ప్రభుత్వం ఏదైనా చర్యలు తీసుకుంటే దేశంలో ఉద్రిక్తతలు చెలరేగే అవకాశముందని, తీవ్రమైన భద్రత చిక్కులు ఏర్పడతాయని అభిప్రాయం వ్యక్తం చేసింది.

ఇదీ చూడండి : ఝార్ఖండ్​లో ఫలితాలు రేపే-హస్తం వైపే ప్రజల మొగ్గు!

Last Updated : Dec 23, 2019, 7:21 AM IST

ABOUT THE AUTHOR

...view details