మహారాష్ట్ర యావత్మల్లో తలలేని ఓ మహిళ మృతదేహం తీవ్ర కలకలం రేపింది. భిల్వాడిలోని డిగ్రాస్ వద్ద గ్రామ దేవత గుడి దగ్గర జరిగిన ఈ దారుణాన్ని నరబలిగా అనుమానిస్తున్నారు పోలీసులు.
గ్రామదేవత ఆలయ ప్రాంగణంలో రక్తపు మడుగులు, మూడు మానవ దంతాలు, సూదులు, చెవి పోగులు, చేతి గాజుల ముక్కలు చూసి ఇక్కడేదో జరిగిందని భావించారు స్థానికులు. గుడి పరిసరాలన్నీ క్షుణ్నంగా శోధించారు. గుడికి నాలుగు కిలోమీటర్ల దూరంలో 36 ఏళ్ల మహిళ మృతదేహం కనిపించింది. తల లేకుండా, నగ్నంగా ఉన్న ఆ శవాన్ని చూసి హడలిపోయారు వారంతా. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు.