అయోధ్య భూవివాదం కేసుపై సుప్రీంకోర్టులో వాదనలు ముగిసిన వేళ ఉత్తర్ప్రదేశ్ సర్కార్ అప్రమత్తమయింది. ప్రభుత్వ ఉద్యోగుల సెలవులు రద్దుచేస్తూ ఆదేశాలు జారీచేసింది. ఇప్పటికే అయోధ్య సహా సున్నిత ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేసింది యూపీ ప్రభుత్వం. తాజాగా నవంబర్ 30 వరకు సెలవులు రద్దుచేస్తున్నట్టు పేర్కొంది.
ప్రధానంగా క్షేత్రస్థాయిలో పనిచేసే అధికారులందరికీ సెలవులు రద్దు చేస్తున్నట్టు ఉత్తర్ప్రదేశ్ అదనపు ప్రధాన కార్యదర్శి ముకుల్ సింఘాల్ తెలిపారు. పండగల వేళ పోలీసు అధికారులు సహా జిల్లా, దిగువ స్థాయిల్లో పనిచేసే ఇతర అధికారుల సెలవులు రద్దు చేయడం సాధారణంగా జరిగేదేనని ఆయన వివరించారు.