తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ముకేశ్ క్షమాభిక్ష పిటిషన్ తిరస్కరణకు దిల్లీ ఎల్​జీ​ సిఫార్సు

జనవరి 22న ఉరిశిక్షను తప్పించుకునేందుకు నిర్భయ దోషుల్లో ఒకడైన ముకేశ్​ కుమార్​ సింగ్​ విశ్వప్రయత్నాలు చేస్తున్నాడు. క్షమాభిక్ష కోరుతూ రాష్ట్రపతికి ముకేశ్​ దాఖలు చేసిన పిటిషన్​ను తిరస్కరించాలని  హోంమంత్రిత్వ శాఖకు దిల్లీ లెఫ్ట్​నెంట్​ గవర్నర్​ సిఫార్సు​ చేశారు.

By

Published : Jan 16, 2020, 5:51 PM IST

Nirbhaya gangrape case
ముకేశ్ క్షమాభిక్ష తిరస్కరణకు దిల్లీ ఎల్​జీ​ సిఫార్సు

నిర్భయ దోషుల్లో ఒకడైన ముకేశ్​ కుమార్​ సింగ్... రాష్ట్రపతికి దాఖలు చేసిన క్షమాభిక్ష పిటిషన్​ను తిరస్కరించాలని​ హోంమంత్రిత్వ శాఖకు దిల్లీ లెఫ్ట్​నెంట్​ గవర్నర్​ సిఫార్స్​ చేశారు.

"ముకేశ్​ క్షమాభిక్షను తిరస్కరించాలన్న సిఫార్సుతో దిల్లీ లెఫ్ట్​నెంట్​ గవర్నర్ నుంచి హోంమంత్రిత్వశాఖకు ​పిటిషన్​ అందింది. పిటిషన్​ను పూర్తి స్థాయిలో పరిశీలించి.. త్వరలోనే తగిన నిర్ణయం తీసుకుంటాం."

- హోంమంత్రిత్వ శాఖ అధికారి

ముకేశ్​ దాఖలు చేసిన క్షమాభిక్ష​ను తిరస్కరించాలని దిల్లీ ప్రభుత్వం లెఫ్ట్​నెంట్​ గవర్నర్​ను బుధవారం కోరింది. ఈ పిటిషన్​ను తిరస్కరించాలని లెఫ్ట్​నెంట్ గవర్నర్​.. హోంశాఖకు వెంటనే సిఫార్సు చేశారు.

ముకేశ్​ క్షమాభిక్ష పిటిషన్​ పెండింగ్​లో ఉన్నందున జనవరి 22న ఉరితీయడం సాధ్యం కాదని కేజ్రీవాల్​ సర్కారు దిల్లీ కోర్టుకు తెలిపింది.

2012 నిర్భయ సామూహిక అత్యాచారం కేసులో నలుగురు దోషులు ముకేశ్​ కుమార్​ సింగ్​ (32), వినయ్​ శర్మ (26), అక్షయ్​ కుమార్​ సింగ్​ (31), పవన్​ గుప్తా (25)లకు జనవరి 22 ఉదయం 7 గంటలకు ఉరిశిక్ష అమలు కావాల్సి ఉంది. ఈ మేరకు దిల్లీ కోర్టు ఈ నెల 7న డెత్​ వారెంట్లు జారీ చేసింది. ​

ABOUT THE AUTHOR

...view details