తెలంగాణ

telangana

ETV Bharat / bharat

నిర్భయ దోషుల ఉరిశిక్ష వాయిదా తప్పదా!

By

Published : Jan 16, 2020, 3:32 PM IST

Updated : Jan 16, 2020, 7:02 PM IST

nirbhaya-case-convicts-wont-be-hanged-on-jan-22
నిర్భయ దోషుల ఉరిశిక్ష వాయిదా తప్పదా!

15:27 January 16

నిర్భయ దోషుల ఉరిశిక్ష వాయిదా తప్పదా!

నిర్భయ దోషుల ఉరిశిక్ష వాయిదా తప్పదా!

నిర్భయ అత్యాచార కేసు దోషులకు ఈ నెల 22న అమలు చేయాల్సిన మరణశిక్ష  వాయిదా పడే సూచనలు కనిపిస్తున్నాయి. నలుగురు దోషుల ఉరిశిక్ష అమలు ప్రక్రియపై శుక్రవారం లోపు స్థితి నివేదిక సమర్పించాలని తిహార్​ జైలు అధికారులను దిల్లీ కోర్టు ఆదేశించింది.

ఉరిశిక్షను వాయిదా వేయాలని నలుగురు దోషుల్లో ఒకడైన ముకేశ్​ కుమార్​ సింగ్ దాఖలు చేసిన పిటిషన్​ను దిల్లీ కోర్టు విచారించింది. తాను రాష్ట్రపతికి దాఖలు చేసిన క్షమాభిక్ష పిటిషన్​ పెండింగ్​లో ఉన్నందున ఉరిని వాయిదా వేయాలని ముకేశ్​ పిటిషన్​లో కోరాడు.

నలుగురు దోషులకు మరణశిక్ష విధించిన తర్వాత జరిగిన పలు పరిణామాల దృష్ట్యా.. డెత్​ వారెంట్లను పక్కన పెట్టాల్సిన అవసరం ఉందని ముకేశ్​ తరఫు న్యాయవాది కోర్టును కోరారు.
రాష్ట్రపతి వద్ద క్షమాభిక్ష నిర్ణయం పెండింగ్​లో ఉన్న నేపథ్యంలో జైలు అధికారులు దిల్లీ ప్రభుత్వానికి లేఖ రాశారు. ఈ విషయంపై జైలు అధికారులు దిల్లీ కోర్టుకు కూడా సమాచారం అందించారు. ఈ సమాచారాన్ని పరిశీలించిన దిల్లీ కోర్టు.... ఉరి అమలు చేసే తేదీపై శుక్రవారం లోపు సమగ్ర సమాచారంతో నివేదిక అందించాలని ఆదేశించింది.

జనవరి 7న దిల్లీ కోర్టు జారీ చేసిన డెత్​ వారెంట్లను నిలిపివేయడానికి దిల్లీ హైకోర్టు నిరాకరించిన నేపథ్యంలో ముకేశ్​ తరఫు న్యాయవాది ట్రయల్​ కోర్ట్​ను ఆశ్రయించారు.

Last Updated : Jan 16, 2020, 7:02 PM IST

For All Latest Updates

TAGGED:

nirbhaya

ABOUT THE AUTHOR

...view details