తెలంగాణ

telangana

ETV Bharat / bharat

నేడు తేలనున్న నిర్భయ దోషుల భవితవ్యం..! - నిర్భయ తాజా వార్తలు

నిర్భయ దోషుల ఉరి శిక్ష అమలు... రోజుకో మలుపు తిరుగుతోంది. దోషుల న్యాయపరమైన అవకాశాలు పెండింగ్​లో ఉన్న నేపథ్యంలో శిక్ష అమలుపై సందిగ్ధం నెలకొంది. ఈ నేపథ్యంలో నలుగురు దోషులు దాఖలు చేసిన పిటిషన్​పై దిల్లీ కోర్టుకు నేడు తిహార్​ జైలు అధికారులు ఇవ్వనున్న నివేదికపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

nirbhaya
నేడు తేలనున్న నిర్భయ దోషుల భవితవ్యం..!

By

Published : Jan 31, 2020, 5:29 AM IST

Updated : Feb 28, 2020, 2:52 PM IST

నేడు తేలనున్న నిర్భయ దోషుల భవితవ్యం..!

దేశంలో సంచలనం సృష్టించిన నిర్భయ కేసులో దోషుల మరణ దండనకు ఆదేశాలు వచ్చినా అమలుపై ఇంకా సందిగ్ధం నెలకొంది. ఓవైపు శనివారం ఉరి శిక్ష అమలు చేసేందుకు తిహార్​ జైల్లో ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. మరోవైపు మరణ దండనను ఆలస్యం చేసేందుకు దోషులు న్యాయపరమైన అవకాశాలను ఉపయోగించుకుంటున్నారు.

దోషుల్లో ఒకడైన ముకేశ్​ కుమార్​ క్షమాభిక్ష పిటిషన్​ కారణంగా ఇప్పటికే జనవరి 22న అమలు కావాల్సిన శిక్ష.. ఫిబ్రవరి 1కి వాయిదా పడింది. ప్రస్తుతం మరో దోషి వినయ్​ కుమార్​ తాజాగా రాష్ట్రపతికి క్షమాభిక్ష అర్జీ పెట్టుకున్నాడు. మూడో దోషి అక్షయ్‌ ఠాకూర్‌ దాఖలు చేసిన క్యురేటివ్​ పిటిషన్‌ను న్యాయస్థానం నిన్న కొట్టివేసినా అతనికి ఇంకా న్యాయపరమైన అవకాశాలు ఉన్నాయి. మరో దోషి పవన్​ గుప్తాకు క్యురేటివ్​ పిటిషన్ ​దాఖలు చేసేందుకు అవకాశముంది.

తిహార్​ జైలుకు కోర్టు నోటీసులు

ఇదే కారణంతో మరణ శిక్ష అమలుపై నిరవధికంగా స్టే విధించాలని నలుగురు దోషులు.. దిల్లీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యం విచారణకు రాగా.. ప్రభుత్వ తరఫు న్యాయవాది అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ పిటిషన్​... న్యాయ వ్యవస్థను అపహాస్యం చేసేలా, శిక్షను ఆలస్యం చేసే ఎత్తుగడలా ఉందని వాదించారు.

వాదనలు ఆలకించిన జడ్జి... తిహార్ జైలు అధికారులకు నోటీసులు జారీ చేశారు. దోషుల అభ్యర్థనపై శుక్రవారం ఉదయం 10 గంటలలోపు తమ అభిప్రాయం చెప్పాలని ఆదేశించారు.

ఆలస్యమవుతుందా?

అంతేకాకుండా వినయ్​ కుమార్​ క్షమాభిక్ష పిటిషన్​ను రాష్ట్రపతి ఒకవేళ తిరస్కరించినా.. దోషికి మరో 14 రోజుల సమయం ఇవ్వాల్సి ఉంటుంది. ఈ పరిస్థితుల్లో తిహార్​ జైలు అధికారులు శుక్రవారం అందించే నివేదికపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. అధికారుల వివరణను అనుసరించి కోర్టు ఆదేశాలు ఇవ్వనుంది.

ముమ్మర ఏర్పాట్లు..

మరోవైపు తిహార్​ జైల్లో దోషులను శనివారం ఉరితీసేందుకు ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. తలారిగా ఎంపికైన పవన్​ జల్లాడ్​ నిన్న తిహార్​ జైలులో రిపోర్టు చేశాడు. నేడు ఉరి శిక్షకు సంబంధించి ట్రయల్స్​ చేయనున్నాడు.

Last Updated : Feb 28, 2020, 2:52 PM IST

ABOUT THE AUTHOR

...view details