తెలంగాణ

telangana

By

Published : Dec 26, 2019, 12:22 PM IST

Updated : Dec 26, 2019, 2:50 PM IST

ETV Bharat / bharat

రైతు నాయకుడు అఖిల్ గొగొయి ఇంట్లో ఎన్​ఐఏ సోదాలు

అసోం రైతు నాయకుడు, సామాజిక కార్యకర్త అఖిల్ గొగొయి నివాసంలో జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్​ఐఏ) అధికారులు సోదాలు నిర్వహించారు. పౌరసత్వ చట్ట సవరణకు వ్యతిరేకంగా జరిగిన ఆందోళనల్లో ఆయన్ను ఇదివరకే అదుపులోకి తీసుకున్నారు. శుక్రవారం గొగొయి కస్టడీ ముగియనుంది. ఈ నేపథ్యంలో తాజా తనిఖీలు జరిగాయి.

NIA raids Akhil Gogoi's house in Guwahati
రైతు నాయకుడు అఖిల్ గొగొయ్ ఇంట్లో ఎన్​ఐఏ సోదాలు

రైతు నాయకుడు అఖిల్ గొగొయి ఇంట్లో ఎన్​ఐఏ సోదాలు

ప్రముఖ సామాజిక కార్యకర్త, అసోం రైతు నాయకుడు అఖిల్ గొగొయి నివాసంలో జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్​ఐఏ) అధికారులు తనిఖీలు నిర్వహించారు. గువాహటిలోని స్వస్థలంలో సోదాలు చేశారు. గొగొయి​ను ఇదివరకే పోలీసుు అదుపులోకి తీసుకోని కస్టడీ విధించారు. శుక్రవారంతో గొగొయ్ కస్టడీ ముగియనుండగా... ఆయన ఇంట్లో సోదాలు నిర్వహించడం చర్చనీయాంశంగా మారింది.

పౌర నిరసనల్లో అరెస్టు...

ఐపీసీ సహా అక్రమ కార్యకలాపాల నిరోధక చట్టం ప్రకారం ఆయనపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా అసోంలో జరిగిన నిరసనల్లో భాగంగా అఖిల్​ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అసోంలో రైతు సంఘాలకు వివిధ సలహాలు ఇచ్చే నేతగా గొగొయికు పేరుంది.

Last Updated : Dec 26, 2019, 2:50 PM IST

ABOUT THE AUTHOR

...view details