తెలంగాణ

telangana

ETV Bharat / bharat

భాజపా అధ్యక్షుడిగా నడ్డా ముందున్న సవాళ్లివే

జేపీ నడ్డా... భాజపా జాతీయ అధ్యక్షుడు. అమిత్​ షా వారసుడిగా బాధ్యతలు చేపట్టిన నడ్డాపై భారీ ఆశలు పెట్టుకున్నాయి భాజపా శ్రేణులు. 2019లో వేర్వేరు రాష్ట్రాల్లో ఓటములు నేర్పిన పాఠాలు అర్థం చేసుకుని, పార్టీని తిరిగి గాడిన పెట్టేందుకు ఆయనే సరైన వ్యక్తి అని భావిస్తున్నాయి. ఈ అంచనాలను అందుకుని... దిల్లీ, బిహార్​ శాసనసభ ఎన్నికల్లో భాజపాను విజయతీరాలకు చేర్చడం నడ్డా ముందున్న ప్రధాన సవాలు.

Nadda's challenge as President of Bjp
భాజపా అధ్యక్షుడిగా నడ్డా ముందున్న సవాళ్లివే...

By

Published : Jan 20, 2020, 3:25 PM IST

2019 సాధారణ ఎన్నికల్లో అఖండ మెజారిటీ సాధించి.. కేంద్రంలో మరోమారు అధికారాన్ని చేజిక్కించుకుంది జాతీయ ప్రజాస్వామ్య కూటమి-ఎన్డీఏ. లోక్​సభ ఎన్నికల్లో తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించిన భారతీయ జనతా పార్టీకి గతేడాది పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం ఊహించని పరిణామాలు ఎదురయ్యాయి. ఝార్ఖండ్​, మహారాష్ట్ర, ఛత్తీస్​గఢ్​, రాజస్థాన్​, మధ్యప్రదేశ్​ శాసనసభ పోరులో కమలం పార్టీ వెనకడుగువేసింది. ఫలితంగా అప్పటివరకు తమ గుప్పిట్లో ఉన్న ఆయా రాష్ట్రాల్లో పట్టు కోల్పోయింది. శివసేన లాంటి మిత్రపక్షాన్ని కూడా దూరం చేసుకుంది.

నడ్డాపైనే అందరికళ్లు

ఈ నేపథ్యంలో అమిత్​ షా వారసుడిగా పార్టీని సమర్థంగా నడిపించే నాయకుడి కోసం వెతికారు కమలదళ నేతలు. సరికొత్త వ్యూహాలతో పార్టీని మరింత బలోపేతం చేస్తూ, తనదైన ముద్ర వేసే 'జగత్​ ప్రకాశ్ నడ్డా' ఇందుకు అన్ని విధాలా సరైన వ్యక్తిగా భావించారు. మృదుస్వభావిగా పేరున్న నడ్డా.. భాజపాపై అసంతృప్తిగా ఉన్న కూటమి పార్టీలతో సానుకూల చర్చలు జరపగలరని ధీమాగా ఉన్నారు కమలనాథులు.

ఒక్కొక్కటిగా దూరమవుతున్న పార్టీలు

మహారాష్ట్ర ఎన్నికల్లో కలిసి పోటీచేసిన భాజపా-శివసేనకు అధికారం పంచుకునే విషయంలో భేదాభిప్రాయాలు తలెత్తాయి. ఫలితంగా అనూహ్య రీతిలో కాంగ్రెస్​-ఎన్​సీపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది శివసేన. కేంద్ర మంత్రివర్గంలో తమకు ప్రాధాన్యం కల్పించలేదన్న అసంతృప్తితో జేడీయూతో పాటు ఝార్ఖండ్ ఎన్నికలకు కొద్దిరోజుల ముందే ఏజేఎస్​యూ(ఆల్​ ఝార్ఖండ్ స్టూడెంట్స్​ యూనియన్​) పార్టీ సైతం కమలానికి మొహం చాటేసింది.

ఆరెస్సెస్​ అధినేత మోహన్ భగవత్​ ఇటీవల చేసిన 'ఆల్ ఇండియన్స్ ఆర్​ హిందూ (భారతీయులందరూ హిందువులే)' వ్యాఖ్యలను ఎన్డీఏ భాగస్వామి అయిన 'రిపబ్లికన్​ పార్టీ ఆఫ్ ఇండియా' ఖండించింది. 2018 ఏడాది ముగింపులో ఉపేంద్ర కుశ్వాహ 'రాష్ట్రీయ లోక్​ సమతాపార్టీ' కూడా ఎన్డీఏ నుంచి వైదొలిగింది. జాతీయ ప్రజాస్వామ్య కూటమి నుంచి దూరమైన పార్టీలన్నీ.. "భాజపా అహంకార స్వభావంతో వ్యవహరిస్తోంది" అని ఆరోపించాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం కొత్త అధ్యక్షుడు జేపీ నడ్డా.. కూటమి నేతలతో రోజువారీ చర్చలు జరపడంలో ప్రధానపాత్ర పోషించాల్సి ఉంది.

అయితే కూటమి పార్టీల నేతల్లో మరో భయం కూడా ఉంది. ఇచ్చిపుచ్చుకునే విషయంలో ఒకవేళ నడ్డాతో సానుకూల చర్చలు జరిగినప్పటికీ.. అమిత్​ షాదే తుదినిర్ణయం అయినందున.. తమకు ప్రాధాన్యం దక్కదేమో అన్నది కూటమి నేతల అనుమానం. ఒకవేళ అదే జరిగితే నడ్డా చర్చలు నీరుగారే అవకాశమూ లేకపోలేదు. ఇలాంటి సందేహాలు నివృతి చేస్తూ... దిల్లీతో పాటు బిహార్​లోనూ భాజపా గౌరవప్రదమైన సీట్లు సాధించేలా చూడాల్సిన బాధ్యత నడ్డాపై ఉంది.

ఇదీ చదవండి:'పోలీసులే దుప్పట్లు ఎత్తుకెళ్లారు'

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details