తెలంగాణ

telangana

ETV Bharat / bharat

"మోదీ ఉన్నంత వరకే నేనూ" - SMRITI

రాజకీయాల నుంచి ప్రధాని నరేంద్ర మోదీ వైదొలిగిన రోజే తానూ నిష్క్రమిస్తానని కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

మోదీ ఉన్నంత వరకే నేనూ

By

Published : Feb 4, 2019, 6:28 PM IST

మోదీ రాజకీయాల్లో ఉన్నంత వరకే తాను కొనసాగుతానని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ తెలిపారు. పుణెలో 'వర్డ్స్​ కౌంట్​ ఫెస్టివల్'​ కు హాజరైన ఇరానీ భాజపా ప్రచార నేతగా ఎదిగిన తీరుపై చర్చలో పలు ప్రశ్నలకు సమాధానిమిచ్చారు.

వేడుకలో పాల్గొన్న ఔత్సాహికులు కేంద్ర మంత్రికి కొన్ని ఆసక్తికర ప్రశ్నలు సంధించారు.

⦁ మిమ్మిల్ని ప్రధానిగా ఎప్పుడు చూడొచ్చు?

⦁ జ.'ఎప్పటికీ చూడలేరు. ప్రజాదరణ కల్గిన నాయకుల సారథ్యంలో పనిచేయడానికే రాజకీయాల్లోకి వచ్చా. దివంగత నేత వాజ్​పేయీ గారి నాయకత్వంలో పనిచేయడం అదృష్టంగా భావిస్తున్నా. ప్రస్తుతం మోదీ నేతృత్వంలో ప్రజాసేవ చేస్తున్నాను. మోదీ రాజకీయాల నుంచి విశ్రాంతి తీసుకున్న రోజే తానూ రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటాను. రాజకీయాల్లో మోదీ ఇంకా సుదీర్ఘకాలం కొనసాగుతారు. మోదీ ఎక్కువ కాలం కొనసాగలేరని అనుకుంటున్న వారంతా తప్పుగా అంచనా వేస్తున్నారు.

⦁ వచ్చే లోక్​సభ ఎన్నికల్లో అమేఠీ నుంచి రాహుల్​గాంధీపై పోటీ చేస్తారా?

⦁ జ. ఎవరు పోటీ చేయాలో పార్టీ అధిష్టానం నిర్ణయిస్తుంది.

కొందరు ప్రత్యేక గుర్తింపు కోసమే సామాజిక మాధ్యమాల్లో తనపై ఛలోక్తులు విసురుతున్నారని మరో ప్రశ్నకు సమాధానమిచ్చారు స్మృతీఇరానీ.
మహిళా నాయకులలో సుష్మా స్వరాజ్, లోక్​సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ తనకు ఆదర్శమని చెప్పారు స్మృతీ ఇరానీ.

ABOUT THE AUTHOR

...view details