కరోనా వైరస్‌పై పోరులో 'మే' నెల ఎంతో కీలకమని వైద్య నిపుణులు భావిస్తున్నారు. వైరస్‌పై భారత్ విజయం సాధిస్తుందా? లేదా? అన్నది మే నెలపైనే ఆధారపడి ఉందంటున్నారు.
గత కొన్ని నెలలుగా భారత్‌ను కరోనా వైరస్ ఆందోళనకు గురిచేస్తోంది. వైరస్ కట్టడికి అనేక అస్త్రాలను ప్రయోగించింది కేంద్ర ప్రభుత్వం. అందులో లాక్డౌన్ ఎంతో ముఖ్యమైనది. అయితే మే 3న లాక్డౌన్ గడువు ముగియనుంది. కానీ పెరుగుతున్న కేసుల నేపథ్యంలో లాక్డౌన్ పొడిగింపు అనివార్యంగా మారనుంది. అదే సరైనదని నిపుణులు కూడా భావిస్తున్నారు. లాక్‌డౌన్‌తో పాటు హాట్‌స్పాట్ కేంద్రాల్లో మరింత కట్టుదిట్టమైన వ్యూహాన్ని పాటించాలని సూచిస్తున్నారు. గ్రీన్ జోన్లకు వైరస్ పాకకుండా చూసుకోవాలని అభిప్రాయపడుతున్నారు.
వైరస్‌ను లాక్డౌన్ అరికట్టలేదని.. అయితే దాని వ్యాప్తిని మాత్రమే నియంత్రించగలదన్న విషయాన్ని అర్థం చేసుకోవడం ఎంతో ముఖ్యమన్నారు నోయిడాకు చెందిన ఫోర్టిస్ ఆసుపత్రి వైద్యుడు, పల్మోనాలజీ-క్రిటికల్ కేర్ అడిషనల్ డైరక్టర్ డా. రాజేశ్ కుమార్ గుప్తా.
"రెడ్ జోన్లలో మరో రెండు వారాలు, అంతకు మించిన రోజుల పాటు కఠినమైన లాక్డౌన్ నిబంధనలు అమల్లో ఉండాలి. గ్రీన్ జోన్లలో కొన్ని ఆంక్షలను సడలించవచ్చు. కానీ ప్రజలు కలవకూడదు. వైరస్‌కు విరుగుడు లాక్డౌన్ కాదని... దాన్ని వ్యాప్తిని మాత్రమే నియంత్రించగలదని అర్థం చేసుకోవాలి. ఈ పరిణామాల్లో మే నెల ఎంతో ముఖ్యమైనది. వైరస్‌పై భారత్ విజయం సాధిస్తుందా? లేదా? అనేది మేపైనే ఆధారపడి ఉంది."
--- డా. రాజేశ్ కుమార్, ఫోర్టిస్ నోయిడా.