చౌకీదార్ ప్రచారాన్ని భారతీయ జనతా పార్టీ ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లేందుకు ప్రయత్నం చేస్తోంది. చౌకీదార్ ప్రతిజ్ఞ చేసిన వారితో మార్చి 31న దేశవ్యాప్తంగా 500 ప్రదేశాల్లో ఏకకాలంలో వీడియో సమవేశంలో ప్రధాని ముఖాముఖీ మాట్లాడనున్నారు.
'మై భీ చౌకీదార్' ప్రచారం ఓ పెద్ద ప్రజా ఉద్యమంగా మారిందన్నారు న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్. ఈ హ్యాష్‌ట్యాగ్‌ను ఇప్పటికే 20 లక్షల మంది ట్వీట్ చేశారని ప్రకటించారు న్యాయమంత్రి.
2014 ఎన్నికల ప్రచారంలోనే మోదీ తనను తాను చౌకీదార్‌గా ప్రకటించుకున్నట్లు గుర్తుచేశారు రవిశంకర్.
ప్రజా ఉద్యమంగా చౌకీదార్: రవిశంకర్ ప్రసాద్ " 'మై భీ చౌకీదార్' ప్రస్తుతం పెద్ద ప్రజా ఉద్యమంగా మారింది. 2014 ఎన్నికల ప్రచారంలోనే మోదీ తాను దేశానికి తొలి సేవకుడిని, చౌకీదార్ (కాపలదారుణ్ని) అవుతానని తెలిపారు. ప్రస్తుతం 'చౌకీదార్' సామాజిక మాధ్యమాల్లో గ్లోబల్ ట్రెండ్‌గా మారింది. 20 లక్షల మంది ఈ హ్యాష్‌ట్యాగ్‌ను ట్వీట్ చేశారు. 1680 కోట్ల మంది వీక్షించారు . కోటి మంది సామాజిక మాధ్యమాల్లో, నమో యాప్ ద్వారా 'చౌకీదార్' ప్రతిజ్ఞ చేశారు. మార్చి 31న వీరందరితో దేశవ్యాప్తంగా 500 ప్రదేశాల్లో ఏకకాలంలో జరిగే వీడియో సమావేశంలో మోదీ మాట్లాడనున్నారు." -రవిశంకర్ ప్రసాద్, కేంద్ర న్యాయశాఖ మంత్రి
మార్చి 16న ప్రధాని నరేంద్ర మోదీ తన మద్దతుదారులకు 'మై భీ చౌకీదార్' (నేనూ కాపలాదారే) ప్రతిజ్ఞ చేయమని ట్వీట్ చేశారు. దీనిని అనుసరిస్తూ కేంద్ర మంత్రులు, భాజపా నేతలు, మద్దతుదారులు వారి ట్విట్టర్ ఖాతాల పేర్ల ముందు 'చౌకీదార్' పదాన్ని చేర్చుకున్నారు.
కాంగ్రెస్ నేతల చౌకీదార్ ఆరోపణలకు దీటుగా మోదీ దాన్నే ప్రచారాస్త్రంగా మలుచుకున్నారు.